Site icon HashtagU Telugu

Hand Transplant Surgery : ఇద్దరికి చేతుల మార్పిడి.. ఆపరేషన్లు సక్సెస్

Hand Transplant Surgery

Hand Transplant Surgery

Hand Transplant Surgery : ఇద్దరు వ్యక్తులకు మనదేశ డాక్టర్లు విజయవంతంగా చేతులను అమర్చారు. భారత వైద్య చరిత్రలో ఈవిధమైన సర్జరీలు చేయడం ఇదే తొలిసారి. ఈ అరుదైన సర్జరీకి హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న అమృత ఆస్పత్రి వేదికగా నిలిచింది. ఉత్తర భారత దేశంలో ఇలాంటి శస్త్రచికిత్స చేసిన తొలి ఆస్పత్రిగా ఫరీదాబాద్‌లోని  అమృత హాస్పిటల్ నిలిచింది.  17 గంటల వ్యవధిలో ఈ ఆపరేషన్లను పూర్తి చేశారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి బాగానే ఉందని.. వారు కోలుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

We’re now on WhatsApp. Click to Join.

గౌతమ్ తయల్‌ ఢిల్లీ వాస్తవ్యుడు.  కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో  ఈ 64 ఏళ్ల వృద్ధుడు తన ఎడమ చేతిని కోల్పోయాడు. 10 సంవత్సరాల క్రితం ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కూడా జరిగింది. ఇటీవల బ్రెయిన్‌ డెడ్‌తో మరణించిన 40 ఏళ్ల వ్యక్తికి చెందిన చేతిని.. అమృత ఆస్పత్రి డాక్టర్లు గౌతమ్‌ తయల్‌కు విజయవంతంగా అమర్చారు.  సర్జరీ ద్వారా అమర్చిన చేతిని, చేతి వేళ్లను గౌతమ్ కదిలిస్తున్నాడని డాక్టర్లు వెల్లడించారు.  త్వరలోనే అతడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేస్తామని తెలిపారు. దీంతో దేశంలో కిడ్నీని, చేతులను మార్పిడి చేయించుకున్న తొలి వ్యక్తిగా గౌతమ్ తయల్ రికార్డును క్రియేట్ చేశాడు. ప్రపంచంలో ఈ తరహా ఆపరేషన్ చేయించుకున్న రెండో వ్యక్తిగా గౌతమ్ తయల్(Hand Transplant Surgery) నిలిచాడు.

Also Read: 9999 Diamonds : 9999 డైమండ్లతో రామాలయ నమూనా.. పెన్సిల్ కొనపై రాముడి ఫొటో

ఇక దేవాన్ష్‌ గుప్తా అనే 19 ఏళ్ల యువకుడు మూడేళ్ల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయాడు. ఇతడికి కూడా ఇదే అమృత ఆస్పత్రి డాక్టర్ల బృందం విజయవంతంగా చేతులను అమర్చింది. బ్రెయిన్‌ డెడ్‌తో మరణించిన 33 ఏళ్ల వ్యక్తికి చెందిన రెండు చేతులను సేకరించి.. దేవాన్ష్ గుప్తాకు అతికించారు. ఈ రెండు ఆపరేషన్లను 2023 డిసెంబరులో నిర్వహించారు. సర్జరీలన్నీ కంప్లీట్ కావడానికి దాదాపు 17 గంటల టైం పట్టిందని అమృత ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది.