రూ.28 రూపాయల కోసం ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి.. ఆరేళ్ల తర్వాత అలా?

ముంబైలో ఒక వ్యక్తి కేవలం 28 రూపాయలు చిల్లర కోసం ఏకంగా ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఆరేళ్ల తర్వాత చనిపోయిన ఆ మృతుని కుటుంబానికి 43 లక్షల పరిహారం అందుతోంది.

  • Written By:
  • Publish Date - June 23, 2022 / 09:00 AM IST

ముంబైలో ఒక వ్యక్తి కేవలం 28 రూపాయలు చిల్లర కోసం ఏకంగా ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఆరేళ్ల తర్వాత చనిపోయిన ఆ మృతుని కుటుంబానికి 43 లక్షల పరిహారం అందుతోంది. అసలేం జరిగిందంటే.. ముంబైలోని విక్రోలి ప్రాంతంలో నివసిస్తున్న చేతన్ అచిర్నెకర్ అనే యువకుడు సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తూ ఉండేవాడు. 2016 జూలై 23 మధ్యాహ్నం 1:30 నిమిషాల ప్రాంతంలో పని ముగించుకుని ఆటోలో ఇంటికి చేరుకున్నాడు. అయితే ఆటో ఛార్జ్ 172 రూపాయలు కావడంతో ఆటో దిగగానే చేతన్ ఆటో డ్రైవర్ కు 200 రూపాయలు చెల్లించాడు.

మిగిలిన ఇరవై ఎనిమిది రూపాయలు చిల్లర ఇవ్వాలి అని డ్రైవర్ ను అడిగాడు. అందుకు డ్రైవర్ నిరాకరించడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే డ్రైవర్ చిల్లర ఇవ్వకుండా ఆటోను వేగంగా కదిలించాడు. అప్పుడు చేతన్ ఆటో ని వెంబడించే క్రమంలో ఆటో కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం కొన్ని రోజులకు చేతన్ కుటుంబసభ్యులు బీమా మొత్తాన్ని చెల్లించాలి అని ఫ్యూచర్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని డిమాండ్ చేశారు. అయితే మొదట్లో వాళ్ళు డబ్బులు చెల్లించేందుకు నిరాకరించారు.

ఈ విషయంపై మోటార్ యాక్సిడెంట్ క్లేయిమ్స్ ట్రిబ్యునల్ ముందు కంపెనీ వాదించింది. మరొక వైపు ఆటో కారణంగానే చైతన్య మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదిక లో తేలడంతో ఆ విషయాన్ని గుర్తించిన ట్రిబ్యునల్ చేతన్ కుటుంబ సభ్యులకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. చేతన్ కుటుంబ సభ్యులకు బీమా కంపెనీ,ఆటోరిక్షా యజమాని కామేలేష్ సంయుక్తంగా రూ.43 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది అని ఆదేశించారు. ప్రమాదం జరిగినప్పుడు చేతన్ జీతం 15000 కాగా దృష్టిలో ఉంచుకొని ట్రిబ్యునల్ నష్టపరిహారాన్ని వడ్డీతో సహా నిర్ణయించింది.