Site icon HashtagU Telugu

Goat’s Birthday: మేకకు ఘనంగా పుట్టినరోజు వేడుక..ఎక్కడంటే..!!

1458307765468 Imresizer

1458307765468 Imresizer

సాధారణంగా మేకలను ఎందుకు పెంచుతారు…మాంసం కోసమే కదా. ఎలాంటి మేకైనా సరే…అది పెరిగిన తర్వాత మటన్ కావాల్సిందే. అలాంటి మేకలను కూడా కొందరు పిల్లులు, కుక్కల్లానే పెంపుడు జంతువుల్లా చూసుకుంటారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అయితే ఓ ఫ్యామిలీ మాత్రం మేకకు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించింది. కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా హిరియూర్ తాలుకా టీబీ గొల్లారహట్టి గ్రామానికి చెందిన క్రిష్ణమూర్తి అనే వ్యక్తి వ్యవసాయం చేస్తుంటాడు. అతని వద్ద ఓ ఆడ మేక పిల్ల ఉంది. దాన్ని కాప్రి అనే పేరుతో పిలుస్తారు. ఆ మేకంటే క్రిష్ణమూర్తికి ఎంతో ఇష్టం. అలాగే ఆ ఫ్యామిలీకి కూడా దానితో మంచి అనుబంధం ఉంది. సొంత బిడ్డలా చూసుకుంటున్నారు.

గతేడాది మే 2న కాప్రి పుట్టింది. కాప్రి పుట్టిన కొన్ని రోజులకే తన తల్లి మరణించింది. దాంతో కాప్రిని క్రిష్ణమూర్తి దంపతులు సొంత బిడ్డాలా చూసుకుంటున్నారు. ఇడ్లీ దొశ చపాతి లాంటివి పెడుతున్నారు. ఇలా చూస్తుండగానే ఏడాది గడిచింది. మే 2న కాప్రి తొలి పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు. 30మంది బంధుమిత్రులతో కలిసి బర్త్ డే వేడుకలను నిర్వహించారు. 5 కేజీల కేట్ తీసుకువచ్చి కట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. క్రిష్ణమూర్తి చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Cover Photo- File Image