Fake Lawyer – Won 26 Cases : 26 కేసులు గెలిచిన ఫేక్ లాయర్ దొరికిపోయాడు

Fake Lawyer - Won 26 Cases : మనం ఇప్పటివరకు ఫేక్ డాక్టర్స్ గురించి విన్నాం. కానీ ఇప్పుడు ఒక ఫేక్ లాయర్ గురించి తెలుసుకోబోతున్నాం.

  • Written By:
  • Publish Date - October 14, 2023 / 06:11 PM IST

Fake Lawyer – Won 26 Cases : మనం ఇప్పటివరకు ఫేక్ డాక్టర్స్ గురించి విన్నాం. కానీ ఇప్పుడు ఒక ఫేక్ లాయర్ గురించి తెలుసుకోబోతున్నాం. అతడి పేరు బ్రియాన్ మువెండా. కెన్యా దేశస్తుడు. తాను లాయర్ అని అందరితో చెప్పుకున్నాడు.. అందరూ నమ్మారు.. కెన్యాలోని వివిధ హైకోర్టులు, జిల్లా కోర్టులలో వాదించి .. ఏకంగా 26 కేసుల్లో తన క్లయింట్ లను గెలిపించాడు. ఫేమస్ లాయర్ గా పేరు సంపాదించాడు. చివరకు ఇటీవల అతడి నిజ స్వరూపం తెలియడంతో పోలీసులు అరెస్టు చేశాడు. అతడు ఫేక్ లాయర్ అని గుర్తించారు. ఇటీవల అరెస్టయ్యే వరకు .. కనీసం కోర్టుల జడ్జీలు కూడా బ్రియాన్ మువెండా ఫేక్ లాయర్ అని గుర్తించలేకపోవడం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join.

బ్రియాన్ మువెండా అరెస్టయిన విషయం తెలియడంతో.. అతడి క్లయింట్లు ఆశ్చర్యపోతున్నారు. ‘‘అతడు చాలా టాలెంటెడ్ .. మా కేసులు ఈజీగా గెలిపించాడు’’ అని మువెండా ద్వారా గతంలో కోర్టు కేసులు గెలిచిన వ్యక్తులు చెబుతున్నారు. మళ్లీ బ్రియాన్ మువెండా జైలు నుంచి విడుదలై తమ తరఫున వాదించాలని ఆశిస్తున్నానని మరో క్లయింట్ చెప్పుకొచ్చాడు. వాదించిన 26 కేసులన్నీ గెలిచిన బ్రియాన్ మువెండా నకిలీ లాయర్ అంటే తాను నమ్మలేకపోతున్నానని అతడి ఇంకో క్లయింట్ చెప్పడం (Fake Lawyer – Won 26 Cases) గమనార్హం.

Also Read: KCR: ‘కెసిఆర్’ టైటిల్ తో జబర్దస్త్ నటుడి సినిమా, హైప్ కోసమేనా