Site icon HashtagU Telugu

Children Dreams: పసిపిల్లలకు కలలు వస్తాయా? నిపుణులు చెప్తున్న రహస్యం ఇదే!

Children

Children

కలలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మనం నిద్రిస్తున్న సమయంలో వచ్చే కలలు ఒకటైతే మరొకటి మనం సొంతం చేసుకునే కలలు. అయితే సొంతం చేసుకునే పగటి కలలు గురించి పక్కన పెడితే.. రాత్రి నిద్రించే సమయంలో వచ్చే కలలు చాలా శ్రేష్టమైనవి.

మామూలుగా మనిషి నిద్రిస్తున్న సమయంలో వివిధ రకాల కలలు అనేవి రావడం సహజం అని చెప్పవచ్చు. ఇక ఆ కలలు నిజంగా మన కళ్ల ముందే జరుగుతుందా అనేంత ప్రభావవంతంగా ఉంటాయి. కొన్నిసార్లు కలలో జరిగేవాటికి ప్రతిస్పందిస్తూ నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తుంటారు కొంతమంది.

కొన్ని సమయం లో వచ్చిన కలలు పగటి సమయంలో జరుగుతున్నట్లుగా కూడా అనిపిస్తుంది. అయితే కలలు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంటుంది. రోజంతా మనం ఉండే విధానం, ఆలోచించే విధానం, ప్రవర్తించే తీరు అనేవి మనం నిద్రపోతున్న సమయంలో బాగా ప్రభావం చూపిస్తాయి.

ఇక కలలు అనేవి ప్రతి ఒక్కరు కంటారు అని తెలుసు. అయితే నాలుగేళ్ల లోపు ఉన్న పసిపిల్లలకు కూడా నిద్రిస్తున్న సమయంలో కలలు వస్తాయా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే నిపుణులు చెబుతున్న రహస్యం ఏంటంటే.. వారికి చాలా తక్కువగా కలలు వస్తాయి అని ఒకవేళ ఆ కలలు వచ్చిన ఆ కలలో వారు ఉండరని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆ వయసులో పిల్లల ఆలోచన శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం వారిలో ఉండదని అంటున్నారు.