Repeatedly Heated Tea : మనం ప్రతిరోజు ఉదయాన్ని టీ తాగి ప్రారంభిస్తాం. టీ తాగిన తర్వాత మనకు రీఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఆఫీసులలో పని అలసటను తగ్గించుకోవడానికి ఉద్యోగులు పదేపదే టీ తాగుతుంటారు. వాస్తవానికి ఇది చాలా చెడ్డ అలవాటు. దీనివల్ల ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుంది. కొంతమంది ఒకేసారి పెద్ద మొత్తంలో టీ తయారుచేసి.. అవసరమైనప్పుడు దాన్ని పదేపదే వేడి చేసి తాగుతుంటారు.ఇలా చాలాసార్లు వేడి చేసిన టీ తాగడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఏం జరుగుతుంది ?
- టీని మళ్లీ మళ్లీ వేడి చేస్తే దానిలోని రుచి, వాసన తగ్గిపోతుంది. పోషకాలు, ఖనిజాలు తగ్గిపోతాయి.
- నాలుగు గంటల కంటే ఎక్కువ సేపు ఉంచిన టీలో బ్యాక్టీరియా పెరిగిపోయి.. ఫంగస్ వృద్ధి చెందే రిస్క్ ఉంటుంది. ఇది కడుపులో అల్సర్ వంటి సమస్యలను క్రియేట్ చేస్తుంది. అతిసారం, తిమ్మిర్లు, కడుపు ఉబ్బరం, వికారం వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
- మీరు టీని వేడి చేయాలనుకుంటే మాత్రం టీ పెట్టిన 15 నిమిషాల వరకు వేడి చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పటికీ బ్యాక్టీరియా వృద్ధి చెందకపోవచ్చు.
లెమన్ టీ బెస్ట్..
లెమన్ టీ తాగితే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటమిన్ సి వంటి అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. లెమన్ టీ ఇన్ఫెక్షన్లు మీ దరి చేరకుండా చేస్తుంది. నిమ్మ కాయలో ఉండే గుణాలు శరీరంలో కొవ్వును తగ్గించడంలో, బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా (Repeatedly Heated Tea) పనిచేస్తాయి. ఈ టీ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. శరీరంలోని విష వ్యర్థాలు తొలగిపోతాయి.
Also Read: Ashwayuja Masam : ఆశ్వయుజ మాసం ఎందుకు స్పెషల్.. కారణాలేంటి ?
గమనిక: ఈ వార్తలోని వివరాలను ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ, మీడియా నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. మీ నిర్ణయానికి పూర్తి బాధ్యత మీదే.