Site icon HashtagU Telugu

Exit Poll 2024 : ఏపీలో గెలుపు ఎవరిదీ..? ఎగ్జిట్ పోల్స్ ఏంచెప్పబోతున్నాయి..?

Exitpoll2024

Exitpoll2024

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తి అయ్యింది. వీటి ఫలితాలు జూన్ 04 న వెల్లడి కాబోతున్నాయి. అంతకంటే ముందు మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్ ద్వారా దేశ వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో అనేది ఓ అంచనా వస్తుంది. ఆ అంచనా బట్టి విజేత ఎవరు అనేది మనం డిసైడ్ అవ్వుచ్చు. అన్ని సందర్భాలలో ఎగ్జిట్ పోల్ చెప్పిందే జరగదు..కొన్ని సార్లు ఎగ్జిట్ పోల్ తీర్పు ను బ్రేక్ చేస్తూ కూడా ఫలితాలు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కాకపోతే 90% మాత్రం ఎగ్జిట్ పోల్ చెప్పిందే జరుగుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయో అనేది ఆసక్తిగా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యంగా ఏపీలో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలని అంత ఎదురుచూస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఏంచెపుతుందో..? వైసీపీ మరోసారి విజయం సాధిస్తుందా..? లేక కూటమి గెలుస్తుందా..? పిఠాపురం బరిలో నిల్చున్న పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీ తో విజయం సాదించబోతున్నారు..? కుప్పం లో చంద్రబాబు పరిస్థితి ఏంటి..? పులివెందుల లో జగన్ గెలుపు ఎంత..? కడప లో అవినాష్ గెలుస్తాడా..? రాజన్న బిడ్డ షర్మిల గెలుస్తుందా..? వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి..? జనసేన 21 సీట్లలో ఎన్ని సీట్లు సాదించబోతుంది ..? ఇక దేశంలో బిజెపి మరోసారి విజయం సాదించబోతుందా.? ఇండియా కూటమి సాదించబోతుందా..? అనేది మరికాసేపట్లో తేలనుంది.

Read Also : Indian 2 : ఇండియన్ 2లో కమల్ కంటే సిద్దార్థ్ ఎక్కువ కనిపిస్తారట..