Site icon HashtagU Telugu

Amala Akkineni: మేటి మహిళ.. అక్కినేని అమల!

Amala1

Amala1

ఆమె ఓ పెద్దింటికి కోడలు.. అయినా ఆమెలో కించుత్తు కూడా గర్వం ఉండదు. టాలీవుడ్ నటీమణుల్లో తాను ఒక్కరు.. అయితేనే చాలా సింపుల్ గా కనిపిస్తూ అందరితో మమేకమవుతుంటారు. భర్త, పిల్లల బాధ్యతలను మోస్తున్నా చెరగని చిరునవ్వుతో కనిపిస్తుంటారు. ఎంట్రప్రెన్యూర్ గా.. అర్ధాంగిగా.. స్టూడియో అధినేతగా, ప్రొడ్యూసర్ గా భిన్న పాత్రలను సమర్థవంతంగా నిర్వహిస్తూ తనముద్ర వేస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈతరం ఆడవాళ్లకు తానోక ఇన్ స్పిరేషన్. ఒక రోల్ మోడల్.. ఆమె ఎవరో కాదు.. అమల అక్కినేని. తాజాగా ఓ స్కూల్ డెవలప్ మెంట్ కోసం 50 వేల సాయం చేసి మారోసారి వార్తల్లో నిలిచారు. ఈ సందర్భంగా అక్కినేని అమల గురించి కొన్ని విషయాలు..

అలా మొదలైంది

బెంగాల్ లో జన్మించిన అమల చెన్నైలోని ‘కళాక్షేత్ర’లో చేరి భరతనాట్యంలో బి.ఎఫ్.ఏ. చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె నాట్యం చూసిన ప్రముఖ నటుడు, దర్శకుడు టి.రాజేందర్, అమలను నటింప చేయాలని ఆశించారు. అమల తల్లిని అంగీకరింపచేసి, తన ‘మైథిలీ ఎన్నై కాదలి’ చిత్రం ద్వారా తెరకు పరిచయం చేశారు. ఆ సినిమా ఘనవిజయంతో అమలకు ఎంతో పేరు లభించింది. సినిమాల్లో నటించే అవకాశాలూ వెల్లువెత్తాయి. తెలుగులో నాగార్జున నటించిన ‘కిరాయిదాదా’ చిత్రంతో జనం మదిని దోచేశారు అమల. ఆ తరువాత “రక్తతిలకం, రాజా విక్రమార్క, అగ్గిరాముడు, ఆగ్రహం” వంటి చిత్రాలలో నటించారు. నాగార్జునతో కలసి అమల “చినబాబు, శివ, నిర్ణయం, ప్రేమయుద్ధం” వంటి చిత్రాలలో అలరించారు. నాగార్జున కెరీర్ ను పెద్ద మలుపు తిప్పిన ‘శివ’ తెలుగు, హిందీ రెండు వర్షన్స్ లోనూ అమల నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మళయాళ భాషల్లో అమల నటించిన అనేక చిత్రాలు జయకేతనం ఎగురవేశాయి. ఆమె నటించిన తమిళ సినిమాలు తెలుగులోకి అనువాదమై అలరించాయి.

మేడ్ ఫర్ ఈచ్ అదర్

అప్పట్లో హిట్ పెయిర్ అనగానే చాలామందికి అక్కినేని నాగార్జున, అమల మాత్రమే గుర్తుకువస్తారు. టాలీవుడ్ లో విజయవంతమైన జోడిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే నాగార్జున, అమల దంపతులను మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటారు. వారి కుమారుడు అఖిల్ బాల్యంలోనే ‘సిసింద్రీ’గా నటించి ఆకట్టుకున్నాడు. ‘సిసింద్రీ’ షూటింగ్ సమయంలో అమల తన తనయుడు అఖిల్ ను నటింప చేయడంలో ఎంత శ్రద్ధ వహించారో అందరికీ తెలుసు. ఆ తర్వాత కొడుకు బాధ్యతలను భుజాన వేసుకొని హీరోగా తీర్చిదిద్దింది. ఒకవైపు కుటుంబ బాధ్యతలు మోస్తూనే.. మరోవైపు కథాబలం ఉన్న సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఆ మధ్య ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో నటించారు. తరువాత అక్కినేని ఫ్యామిలీ హీరోస్ అందరూ అభినయించిన ‘మనం’లోనూ ఆమె కాసేపు కనిపించారు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తోన్న తెలుగు, తమిళ చిత్రంలోనూ ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

 జంతు రక్షణ కోసం

మనుషులకు తోడు నీడగా ఉండే జంతువులకు ‘మెరుగైన ప్రపంచం’ సృష్టించేందుకు అమల అక్కినేని బ్లూ క్రాస్ సొసైటీని ప్రారంభించింది. దాని ద్వారా ఎన్నో జంతుజాలన్ని కాపాడారు. ముఖ్యంగా వీధి కుక్కలను రక్షించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన బాధ్యతలను మరిచిపోలేదామె. ఒకవైపు సినిమాలు, మరోవైపు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉన్నా.. జంతు రక్షణ మాత్రం విడిచిపెట్టలేదు.

మంచి మనసు

అక్కినేని అమలు స్పందించే మనసు కూడా. అందుకే ఉదాహరణే ఈ ఘటన. నిజామాబాద్ జిల్లా బోధ‌న్ మండ‌లంలోని ఖంద్గాం ప్రాథ‌మికోన్నత పాఠ‌శాల‌కు అక్కినేని అమ‌ల రూ. 50 వేల ఆర్థిక సాయం అందించారు. గ‌తంలో ఖంద్గాం గ్రామంలో జ‌రిగిన ఓ వివాహానికి అమ‌ల వ‌చ్చిన‌ప్పుడు పాఠ‌శాల అభివృద్ధి కార్యక్రమాల‌ను టీచ‌ర్లు, గ్రామ‌స్తులు ఆమెకు వివ‌రించారు. దీంతో తాను రూ. 50 వేల ఆర్థిక‌సాయం చేస్తాన‌ని అమ‌ల మాటిచ్చి, నెర‌వేర్చారు.

Exit mobile version