Site icon HashtagU Telugu

Natasha Bassett: ఎలాన్ మస్క్ కొత్త గాళ్ ఫ్రెండ్ ఎవరో తెలిసిందోచ్..!

Elon Musk

Elon Musk

ఎలాన్ మస్క్…వివాదాస్పద విషయాల్లో ఆయన పేరు తరచూనానుతుంది. తనకు సంబంధం ఉన్నా లేకున్నా….ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటారు. ఈ మధ్య ప్రముఖ సోషల్ మీడియా ట్విటర్ ను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు..దానిని సొంతం చేసుకున్న ఆయన భారీ కసరత్తు చేస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నో వివాదాలు మస్క్ ను చుట్టుముట్టాయి. అయినా వాటిని పట్టించుకోకపోవడం…తనకు తోచినట్లు మాట్లాడటం….అప్పుడప్పుడూ వివాదాలను మరింత పెంచేలా వ్యవహరించడం మస్క్ కు అలవాటైంది. ఇప్పుడు తాజాగా మస్క్ కు సంబంధించి మరో వ్యక్తిగత విషయం బయటకు వచ్చింది. మస్క్ కు గతంలోనే పెళ్లి జరిగింది. భార్యతో విడాకులు కూడా తీసుకున్నాడు.

ఆ తర్వాత మస్క్ ఎవరితోనో రహస్యంగా డేట్ చేస్తున్నారన్న వార్తలెన్నో బయటకు వచ్చాయి. వాటికి సంబంధించిన ఆధారాలు మాత్రం బయటకు రాలేదు. తాజాగా ఆ రహస్యం ఒకటి బయటకు పొక్కింది. 50ఏళ్ల మస్క్ తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన 27ఏళ్ల నటి నటాషా బాసెట్ తో డేట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఏడాది మొదట్నుంచీ వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తీరుగుతున్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి.

ఇలాంటి వార్తలు బయటకు వస్తున్నాయ్…కానీ దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం లేవు. ఇలాంటి తరుణంలో ఫ్రాన్స్ లో ఒక విలాసవంతమైన హోటల్లో విడిది చేస్తూ…కెమెరా కంటికి చిక్కారు. ఫ్రాన్స్ లో అత్యంత ఖరీదైన హోటల్లో ఒకటైన షివర్ బ్లాంక్ హోటల్లో కలిసి భోజనం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. అసలు మస్క్ ఫ్రాన్స్ కు ఎందుకు వెళ్లినట్లు…అనే ప్రశ్నకు నటాషా బాసెట్ కొత్త సినిమా ఎల్విస్ ప్రమోషన్ కోసం వెళ్తే…గాల్ ఫ్రెండ్ కోసం మస్క్ వెళ్లి ఉంటారని చెబుతున్నారు. ప్రస్తుతం ఫ్రెండ్స్ గా ఉన్న వీరిద్దరి మధ్య డేట్ నడుస్తోందన్న విషయం ఆసక్తికరంగా మారింది.

Exit mobile version