Elon Musk Vs Indians : ప్రపంచ సంపన్నుల జాబితాలో భారతీయుల దూకుడు

Elon Musk Vs Indians :  ప్రపంచ ధనవంతుల జాబితాలో అత్యుత్తమ ర్యాంకుల కోసం భారతీయులు కూడా పోటీపడుతున్నారు.

  • Written By:
  • Updated On - March 5, 2024 / 12:26 PM IST

Elon Musk Vs Indians :  ప్రపంచ ధనవంతుల జాబితాలో అత్యుత్తమ ర్యాంకుల కోసం భారతీయులు కూడా పోటీపడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల లిస్టులో భారత్ నుంచి రూ.9 లక్షల కోట్ల సంపదతో ముకేశ్ అంబానీ 11వ స్థానంలో, రూ.8 లక్షల కోట్ల సంపదతో గౌతమ్ అదానీ 12 వ స్థానాల్లో కంటిన్యూ అవుతున్నారు. రానున్న రోజుల్లో వీరి ర్యాంకు మరింత పడే అవకాశాలు లేకపోలేదు. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ లాంటి సంపన్నులను భారతీయులు అధిగమించే రోజులు ఎంతో దూరంలో లేవనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. తాజాగా ఈ లిస్టులో పెద్ద మార్పు జరిగింది. 9 నెలలుగా నంబర్ 1 ధనవంతుడి ప్లేస్‌లో ఉన్న ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్‌ను అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ వెనక్కి నెట్టేశాడు. ఈ మార్పు జెఫ్ బెజోస్ బలం వల్ల జరగలేదు. ఎలాన్ మస్క్(Elon Musk Vs Indians) బలహీనత వల్ల జరిగింది. సోమవారం రోజు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా షేర్ల ధర ఏకంగా 7.16 శాతం పడిపోయి 188.14 యూఎస్ డాలర్లకు చేరింది. దీంతో టెస్లా మార్కెట్ విలువ భారీగా పతనమైంది. ఈ పరిణామంతో మస్క్ సంపద  మంచులా కరిగిపోయింది.దీంతో నిలకడగా లాభాలు సంపాదిస్తున్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నంబర్ 1 స్థానానికి ఎగబాకాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ఈవివరాలను ప్రస్తావించారు.

We’re now on WhatsApp. Click to Join

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం  జెఫ్ బెజోస్ సంపద రూ. 16.58 లక్షల కోట్లు. ఎలాన్ మస్క్ సంపద రూ. 16.41 లక్షల కోట్లు. ఇద్దరి మధ్య వ్యత్యాసం చాలా తక్కువే. 2017లో జెఫ్ బెజోస్ తొలిసారిగా మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్‌ను దాటేసి తొలి స్థానానికి చేరుకున్నారు.చివరిసారిగా 2021లో ప్రపంచ నంబర్ 1 సంపన్నుడిగా బెజోస్ అవతరించాడు.మళ్లీ ఇన్నేళ్లకు ఆయనకు ఆ అవకాశం లభించింది. ఒక దశలో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ మధ్య సంపద వ్యత్యాసం రూ.11 లక్షల కోట్లు ఉండేది.  అమెజాన్ షేర్ల ధరలు గత కొంతకాలంగా పెరుగుతుండటం ప్లస్ పాయింట్ అయింది. 2022 నుంచి చూస్తే అమెజాన్ షేర్ల ధరలు రెట్టింపు అయ్యాయి. ఈ క్రమంలోనే అమెజాన్ షేరు ధర రికార్డు గరిష్టాలకు చేరగా.. టెస్లా స్టాక్ 2021లో గరిష్ట ధరల స్థాయి నుంచి 50 శాతం మేర పడిపోయింది.

Also Read : Srisailam : శ్రీశైలంకు వంతెన మార్గం.. పులుల సంరక్షణ కేంద్రం పైనుంచి..

గత మూడేళ్లుగా ఎలాన్ మస్క్ తన టాప్ ర్యాంకును లూయిస్ విట్టన్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ సహా బెజోస్‌కు కోల్పోతూనే ఉన్నారు. కానీ ఎక్కువ కాలం ఈ ర్యాంకులో మస్క్ మాత్రమే  కొనసాగారు. ఇప్పుడు మూడో స్థానంలో ఉన్న ఆర్నాల్ట్ సంపద రూ.16 లక్షల కోట్లు. ప్రపంచ సంపన్నుల లిస్టులో నాలుగో స్థానంలో ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్‌బెర్గ్ (రూ.15 లక్షల కోట్లు), ఐదో స్థానంలో బిల్ గేట్స్ (రూ.13  లక్షల కోట్లు), ఆరో స్థానంలో స్టీవ్ బామర్ (రూ.12 క్షల కోట్లు),  ఏడో స్థానంలో వారెన్ బఫెట్ (రూ.11 లక్షల కోట్లు),  ఎనిమిదో స్థానంలో లారీ ఎలిసన్ (రూ.10 లక్షల కోట్లు),  తొమ్మిదో స్థానంలో  లారీ పేజ్ (రూ.10 లక్షల కోట్లు), పదో స్థానంలో సెర్జీ బ్రిన్ (రూ.9 లక్షల కోట్లు) ఉన్నారు.

Also Read : Abortion Right : అబార్షన్‌ ఇక మహిళల రాజ్యాంగ హక్కు