Viral Video:ఎండవేడిమి తట్టుకునేందుకు బురదనీటిలో సేదతీరుతున్న గజరాజులు.!!

వింతలు-విశేషాలకు కేరఫ్ అడ్రస్ సోషల్ మీడియా. ప్రపంచం నలుమూలల ఏం జరిగినా..క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.

  • Written By:
  • Publish Date - May 4, 2022 / 05:30 AM IST

వింతలు-విశేషాలకు కేరఫ్ అడ్రస్ సోషల్ మీడియా. ప్రపంచం నలుమూలల ఏం జరిగినా..క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువుల వీడియోలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయ్. జంతు ప్రపంచంలో ఎన్నో వింతలు, అద్భుతాలు జరుగుతుంటాయ్. అలాంటివి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనప్పుడు వాటిని చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అయితే భూమిపై అతి పెద్ద జంతువు ఏనుగు. తెలివైనది కూడా. అలాంటి ఏనుగులు ఎండవేడిమికి తట్టుకోలేకపోతున్నాయి. ఎండలు దంచికొడుతుండటంతో…వేడి నుంచి తప్పించుకోవడానికి జంతువులు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎండవేడిమికి తట్టుకోలేక బురుద నీటిలో ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒడిశాలోని మయూర్ భంజ్ లోని బరిపాడ డివిజన్, రాస్ గోవింద్ పూర్ ఫారెస్ట్ రేంజ్ నుంచి తీసిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొంత సరదాగా…ఈవిధంగా ఏనుగులు వేడి నుంచి రక్షణపొందుతున్నాయి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు ట్విట్టర్ లో ఇప్పటికీ 48వేల మంది చూడగా 3200మంది లైక్ చేశారు.