Site icon HashtagU Telugu

Viral Video : కృష్ణుడి భజనలో ఏనుగు డ్యాన్స్ ..వైరల్ వీడియో..!!

Elephant1

Elephant1

నవరాత్రుల్లో ప్రతిఒక్కరూ గర్భా, దాండియా ఆడుతుంటారు. అంతేకాదు భజన సమయంలో చాలామంది భక్తులు భక్తిలో మునిగిపోతారు. భక్తి పాటలు మనస్సును ఉత్తేజపరుస్తుంటాయి. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ అక్కడ భజనకు పులకరించింది మనిషి కాదు..ఏనుగు. బాంకే బిహారీ కృష్ణ కన్హయ్య లాల్ పాటకు రోడ్డుపై వెళ్తున్న ఏనుగు డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియోను జిందగీ గుల్జార్ హై పేరుతో ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. 50వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 3వేల మంది లైక్ కొట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలు కామెంట్లు చేస్తున్నారు. ‘ప్రతి ఒక్కరూ కృష్ణభక్తిలో మునిగిపోయారు’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా…ఏనుగు హరికి భక్తి చేస్తోందంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.