Site icon HashtagU Telugu

Price Hike : జూన్ 1 బ్యాడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ టూ వీలర్లకు “ఫేమ్” కట్

Price Hike

Price Hike

ఇప్పటికే సూర్యుడు నిప్పులు చిమ్ముతుంటే.. చెమటలు కక్కుతున్న సామాన్యులకు ఒక బ్యాడ్ న్యూస్. ప్రత్యేకించి జూన్ 1 తర్వాత ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వాళ్లకు ఇది రియల్ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే జూన్ 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్‍ల ధరలు (Price Hike) పెరగనున్నాయి. ఇంతకీ వీటి రేట్లు ఇంత సడెన్ గా  ఎందుకు పెరుగుతున్నాయో(Price Hike) తెలియాలంటే.. మనం “ఫేమ్” (FAME) అనే స్కీం గురించి తెలుసుకోవాలి. దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్‍ల తయారీ, సేల్స్ ను ప్రోత్సహించేందుకు కేంద్ర సర్కారు 2015 ఏప్రిల్ లో ప్రకటించిన  పథకం ఇది. ఇందులో మొదటి దశ స్కీం ను FAME I అని, రెండో దశ స్కీం ను FAME II అని అంటారు. ఈ స్కీం లో భాగంగా తక్కువ రేటులో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్‍లు సేల్ చేసేందుకు వీలుగా.. వాటి తయారీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ (రాయితీ) ఇచ్చేది. అవి సేల్ చేసిన వెహికల్స్ బిల్లుల ఆధారంగా సబ్సిడీ అమౌంట్ ను కేంద్ర సర్కారు రిలీజ్ చేసేది. దీనివల్ల  ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీలపై నిర్వహణ భారం చాలా వరకు తగ్గేది.

also read : Electric Bike: కేఫ్ రేజర్ ఎలక్ట్రిక్ బైక్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ.. పూర్తి వివరాలు ఇవే?కేఫ్ రేజర్ ఎలక్ట్రిక్ బైక్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ.. పూర్తి వివరాలు ఇవే?

40 శాతం వరకు సబ్సిడీ కట్..

FAME II ( ఫేమ్-2) సబ్సిడీ కింద ఇప్పటి వరకు ఒక్కో కిలో వాట్‍ హవర్ (kWh) కలిగిన ఎలక్ట్రిక్ టూ వీలర్ కు కేంద్ర  ప్రభుత్వం రూ.15,000 సబ్సిడీ ఇచ్చేది. దీన్ని జూన్ 1 నుంచి రూ.10,000 తగ్గించనున్నారు. అర్హత కలిగిన ఎలక్ట్రిక్ టూ వీలర్లపై ఎక్స్-ఫ్యాక్టరీ ధరపై గరిష్ఠంగా  40 శాతం వరకు సబ్సిడీ లభించేది. ఇప్పుడు ఆ పరిమితిని ఏకంగా 15 శాతానికి ప్రభుత్వం తగ్గించింది. దీంతో జూన్ 1 నుంచి అంతమేర రేట్లు పెంచేందుకు ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీలు రెడీ అయ్యాయి. ఒక ఉదాహరణ చూద్దాం.. రూ.1,00,000 ఎక్స్-షోరూమ్ ధర ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్.. ప్రస్తుతం ఫేమ్-2 కింద రూ.40,000 సబ్సిడీని పొందుతుంటే.. జూన్ 1 నుంచి ఆ సబ్సిడీ రూ.15,000కు తగ్గిపోతుంది. దీంతో ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే వినియోగదారుడు రూ.25,000 అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 1 నుంచి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనే వాళ్లపై ఎంతగా భారం పెరుగుతుందో దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

also read : KIA Cars: త్వరలో కియా మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUV, MPV కారు.. 2025 నాటికి విడుదల..!

ధరల్లో వచ్చే మార్పు (అంచనా) ..