Site icon HashtagU Telugu

Election Commission of India : ఓటర్ ఐడీ కార్డుల జారీపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

Election Commission takes key decision on issuance of voter ID cards

Election Commission takes key decision on issuance of voter ID cards

Election Commission of India : ఓటర్లకు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మరో కీలక చర్యను చేపట్టింది. ఇప్పటివరకు ఓటర్ కార్డు పొందడానికి లేదా దానిలో మార్పులు చేయించుకోవడానికి నెలరోజులకు పైగా సమయం పడుతున్న పరిస్థితేనె, ఇకపై ఈ ప్రక్రియను గణనీయంగా వేగవంతం చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు, ఓటర్ ఐడీ కోసం దరఖాస్తు చేసినవారికి కేవలం 15 రోజుల్లోపే కార్డులు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న వారికే కాకుండా, ఇప్పటికే ఓటర్ ఐడీ ఉన్నవారు తమ వివరాల్లో మార్పులు కోరిన సందర్భాల్లోనూ వర్తిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం మరింత పారదర్శకంగా ఉండేందుకు రియల్ టైమ్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ప్రవేశపెట్టబడుతుంది.

Read Also: APSRTC Special : పూరీ జగన్నాథ రథయాత్రకు ఏపీ నుంచి ప్రత్యేక బస్సులు..టికెట్ ధర, బుకింగ్ వివరాలు ఇవే !

ఓటర్ ఐడీ తయారీ నుంచి ఓటరు చేతికి అందే వరకు ప్రతి దశను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌ఓ) స్థాయిలో పర్యవేక్షించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అంతేకాకుండా, ఓటర్లు తమ కార్డు స్థితిని ఎప్పటికప్పుడు ఎస్‌ఎమ్‌ఎస్‌ సేవల ద్వారా తెలుసుకునే వీలును కల్పించారు. ఇది ఓటర్లకు విశ్వాసాన్ని కలిగించడమే కాకుండా, నేరుగా సమాచారాన్ని అందించే సౌలభ్యాన్ని కల్పిస్తుంది. ఈ చర్యల నేపథ్యంలో పోస్టల్ శాఖ కీలక పాత్ర పోషించనుంది. ఓటర్ ఐడీ తయారైన వెంటనే దాన్ని పోస్టు ద్వారా సంబంధిత ఓటర్లకు పంపించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది దేశవ్యాప్తంగా కోట్లు మంది ఓటర్లకు వర్తించేలా విస్తృతంగా అమలులోకి రానుంది. ఈ నిర్ణయం నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలు మరింత ప్రభావితమవుతాయి.

ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో జరిగే అవకాశం ఉండగా, ఈ కొత్త విధానం ఆ రాష్ట్రంలో ముందుగా అమలయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా వచ్చే ఏడాది తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ విధానం కీలకంగా మారనుంది. ఓటర్లకు త్వరిత సేవలు, పారదర్శకత, సమర్థత వంటి అంశాలపై దృష్టి పెట్టిన ఈసీ, డిజిటల్ ట్రాకింగ్, వేగవంతమైన పంపిణీ వంటి ఆధునిక పద్ధతుల ద్వారా ప్రజాస్వామ్యానికి మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓటర్ల హక్కులను సమర్థవంతంగా అమలు చేయడంలో ఇది కీలక మైలురాయిగా మారనుంది.

Read Also: డోనాల్డ్ ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్‌ను లంచ్‌కు ఆహ్వానించగా, వైట్ హౌస్ అభిప్రాయము