CM Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేసు నమోదు అయింది. ముడా కుంభకోణంపై కేసు నమోదు చేసినట్లు ఈరోజు (సోమవారం) ఈడీ అధికారులు తెలిపారు. ఇటీవల రాష్ట్ర లోకాయుక్త ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థ.. మనీలాండరింగ్ కేసులో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసినట్లు వెల్లడించింది. కాగా, ఇప్పటికే ముడా స్థలం కేటాయింపు కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతితో పాటు మరో ఇద్దరిపై మైసూరు లోకాయుక్త పోలీసులు శుక్రవారమే కేసును నమోదు చేశారు.
Read Also: RGV : వర్మ బెడ్ రూమ్ ను వాడుకున్న పనిమనిషి..
అంతేకాక, ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యను ఏ1గా, ఆయన భార్య పార్వతిని ఏ2గా లోకాయుక్త పోలీసులు చేర్చారు. అంతేకాదు.. ముఖ్యమంత్రిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపేందుకు ఇప్పటికే కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ సైతం అనుమతిని ఇవ్వడంతో రాష్ట్రంలో తీవ్ర దుమారం కొనసాగుతుంది.
ఈ నేపథ్యంలోనే ఇటీవలె సిద్ధరామయ్య సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక రాష్ట్ర పరిధిలో ఏ కేసులోనైనా విచారణ కోసం వచ్చేందుకు సీబీఐకి ప్రస్తుతం ఉన్న సాధారణ అనుమతిని రద్దు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. కర్ణాటకలో సీబీఐ విచారణ జరిపే ప్రతి కేసునూ పరిశీలించాకే అనుమతివ్వాలని నిర్ణయించింది. సీబీఐ పక్షపాతిగా వ్యవహరిస్తోందని.. రాష్ట్రం అనుమతించిన చాలా కేసుల్లో సీబీఐ ఛార్జ్‌షీట్ కూడా తెరవలేదని పేర్కొంది. గాడి తప్పుతున్న సీబీఐని కంట్రోల్‌లో పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక తెలిపింది. అయితే సీబీఐకి నో ఎంట్రీ చెప్పడానికి.. సీఎం సిద్ధరామయ్యపై నమోదైన ముడా కుంభకోణం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read Also: Hydra : హైడ్రా నిర్ణయంపై కేబినెట్ లో ఎందుకు చర్చించలేదు: ఈటెల రాజేందర్