Site icon HashtagU Telugu

Water Flows Up Here : అక్కడ నీటి ప్రవాహం ఎగువకే.. న్యూట్రల్ లోనూ వెహికల్ ముందుకే !!

Water Flows Up Here

Water Flows Up Here

Water Flows Up Here : “నిజం దేవుడెరుగు .. నీరు పల్లమెరుగు” అంటారు పెద్దలు !!

నీళ్లు ఎల్లప్పుడూ  పల్లంగా (దిగువకు) ఉన్న వైపే ప్రవహిస్తాయని దీని అర్ధం.  

సైన్సు ప్రకారం చెప్పుకోవాలంటే.. భూమికి ఉండే గురుత్వాకర్షణ బలం కారణంగా ఇలా జరుగుతుంది. 

ఒకవేళ ఇందుకు విరుద్ధంగా నీటి ప్రవాహం రివర్స్ లో డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ కు ప్రవహిస్తే.. మ్యాజిక్ కదా !!

ఇలాంటి మ్యాజిక్స్ జరిగే  ప్లేసెస్ పై ఒక లుక్ వేద్దాం. 

మన భూమి ఎన్నో వింతలు, విడ్డూరాలకు నెలవు. వీటిలో మనకు తెలిసినవి గోరంత. తెలియనివి కొండంత.  ఇప్పుడు మనం భూమి గురుత్వాకర్షణ శక్తి (ఎర్త్ మాగ్నెటిక్ పవర్)  కూడా పనిచేయని మ్యాజికల్  ప్రదేశాల గురించి తెలుసుకుందాం.. మన దేశంలో కూడా ఇలాంటి 2  ప్లేసెస్ ఉన్నాయి మరి !!

లేహ్‌లో మాగ్నెటిక్ హిల్ 

కాశ్మీర్ లోని లేహ్‌లో మాగ్నెటిక్ హిల్ ఉంది. లేహ్ నుంచి కార్గిల్ వైపు వెళ్లే రూట్ లో సరిగ్గా  30 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న రోడ్డు ఉంది. అక్కడికి వెళ్లగానే “మాగ్నెటిక్ హిల్” అనే టైటిల్ తో ఒక బోర్డు కనిపిస్తుంది. ఈ రోడ్డుపై  వాహనాలు ఎంత స్లోగా వెళ్లేందుకు ట్రై చేసినా.. స్పీడ్  గంటకు 20 కిలోమీటర్లకు పైనే ఉంటుందని అంటారు.

ఛత్తీస్‌గఢ్‌ సిమ్లా 

మైన్‌పట్‌ అనే హిల్ స్టేషన్ ను ఛత్తీస్‌గఢ్‌ సిమ్లా అని పిలుస్తారు. మైన్‌పట్‌ లో గొప్పగా చెప్పుకోవడానికి ఒక ప్లేస్ ఉంది. రెహార్ అనే నది  మైన్‌పట్‌ హిల్ స్టేషన్ మీదుగా ప్రవహిస్తుంటుంది. హిల్ స్టేషన్ లోని ఒక ప్రాంతంలో ఉన్న వాటర్ ఫాల్ వద్ద  భూమి గురుత్వాకర్షణ శక్తి లేదు. ఫలితంగా రెహార్ నది ప్రవాహం కింది నుంచి కొండ పైకి రివర్స్ లో ప్రవహిస్తూ(Water Flows Up Here) అబ్బురపరుస్తుంది. 

స్పూక్ హిల్

అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న “స్పూక్ హిల్” వెరైటీ ప్లేస్. ఈ ప్లేస్ కు వెళ్లి మన వాహనాన్ని న్యూట్రల్ లో పెట్టినా .. ఎగువ వైపే వెళ్తుంది. అక్కడ భూమి గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఈక్రమంలో ఆ ఏరియాలో డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎవరో తాళ్లు కట్టి వెహికల్ ను పైకి గుంజుతున్నారనే ఫీలింగ్ కు లోనవుతుంటారు.

శాంటా క్రజ్‌ మిస్టరీ స్పాట్ 

అమెరికాలోని మిచిగాన్‌లో ఉన్న సెయింట్ ఇగ్నేస్ మిస్టరీ స్పాట్‌ను 1950వ దశకంలో గుర్తించారు. భూమి  గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల ఇక్కడ  వంపుతిరిగిన కోణంలో కూడా  గోడ ముందు మనం  నిలబడొచ్చు. ఇలాంటి మ్యాజిక్స్ ఇక్కడే సాధ్యమవుతాయి.