Site icon HashtagU Telugu

Another Earth: భూమి లాంటి గ్రహం.. అక్కడ మనుషులు జీవించచ్చు.. మరిన్ని వివరాలు?

Bozgnnaa

Bozgnnaa

ప్రస్తుతం ఉన్న గ్రహాలలో భూమిపై మాత్రమే మనుషులు నివసించడానికి అన్ని వాతావరణ అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అయితే భూమి తరహాలోనే ఏ గ్రహంలోనైనా మనుషులు జీవించడానికి ఆస్కారం ఉందా అని శాస్త్రవేత్తలు గత కొన్ని సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఈ పరిశోధనలు నిపుణులు కాస్త పురోగతి సాధించారని తెలుస్తోంది. అచ్చం మన భూగ్రహంలో మాదిరిగా పాలపుంత గెలాక్సీ లో కూడా మనుషులు జీవించవచ్చని నిపుణులు కనుగొన్నారు.

కోపెన్ హాగన్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలో భాగంగా పాలపుంతలో కూడా మనుషులు నివసించే అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలియజేశారు.ఇప్పటివరకు జరిగిన పరిశోధనలో భాగంగా మంచు గ్రహశకలంతో ఢీ కొట్టినప్పుడు నీళ్లు ఏర్పడతాయని తెలుసుకున్నారు. తాజాగా నిపుణులు కొత్త సిద్ధాంతం ప్రకారం వీనస్, మార్స్ లో భూమి మాదిరిగానే భూమికి బిల్డింగ్ బ్లాకులలో ఒకటిలాగా ఉందని సూచించారు. ప్రొఫెసర్ అండర్స్ జోహన్సేన్ ‘ద్రవ నీరు ఉందా అనేదానికి నిర్ణయాత్మక స్థానం గ్రహం దాని నక్షత్రం నుండి దూరం’ అని పేర్కొంది.

ఇక భూమి మాదిరిగానే పాలపుంత లో ఉన్నటువంటి అన్ని గ్రహాలు నీరు మరియు కార్బన్ తో ఒకేవిధంగా ఏర్పడే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ప్రొఫెసర్ తెలిపారు. పాలపుంతలో ఉష్ణోగ్రతలు సరిగా ఉన్నందున నక్షత్రాలలో జీవితం ఉండగల సంభావ్య ప్రదేశాలను కలిగి ఉండటానికి ఇది దారితీస్తుంది. ఇక పరిశోధకులు అభివృద్ధి చేసిన అన్ని నమూనాలతో అన్ని గ్రహాలు ఒకే ఈ రకమైన నీరు భూ నిర్మాణాలను కలిగి ఉన్నాయి అయితే కొన్ని గ్రహాలు పొడిగా ఉండవచ్చు మరికొన్ని పూర్తిగా నీటితో కప్పబడి ఉండవచ్చు అంటూ శాస్త్రవేత్తలు తెలిపారు.

Exit mobile version