Earth Hour Day 2024 : ఈరోజు గంటపాటు అంత చీకటిమయం ..

వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఈ రోజును ఎర్త్ అవర్ జరుపుకొంటున్నారు

Published By: HashtagU Telugu Desk
Earth Hour Day Hyderabad

Earth Hour Day Hyderabad

ఈరోజు గంటపాటు అంత చీకటిమయం కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి ఒక రోజున ఎర్త్ అవర్ (Earth Hour Day ) అని పాటిస్తున్నారు. వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఈ రోజును ఎర్త్ అవర్ జరుపుకొంటున్నారు. ఈరోజు ( మార్చి 23న ) రాత్రి 8.30 నుంచి 9.30 వరకు గంటపాటు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ సమయంలో ఒక గంటపాటు అవసరం లేని లైట్లు ఆఫ్ చేయాలి. దీనికి మన హైదరాబాద్ వేదిక కాబోతుంది. ఎర్త్ అవర్ (Earth Hour 2024) సమయంలో.. వ్యక్తులు, కమ్యూనిటీలు, వ్యాపారులంతా.. భూమి పట్ల నిబద్ధతకు చిహ్నంగా.. లైట్లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఒక గంట పాటు ఆఫ్ చేయాలని సూచిస్తారు. ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు ఎర్త్ అవర్ కు పిలుపునిచ్చాయి.

ఎర్త్ అవర్ (Earth Hour 2024) అంటే ఏంటి..? ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు..?

We’re now on WhatsApp. Click to Join.

వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమ అసలు లక్ష్యం. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సింబాలిక్ లైట్స్ అవుట్ కార్యక్రమంగా ప్రారంభమైంది. అప్పటి నుంచి 190కి పైగా దేశాల్లో ఈ కార్యక్రమాన్ని పాటిస్తూ.. ప్రపంచ ఉద్యమంగా మారింది. ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌లో కూడా ఈ కార్యక్రమాన్ని పాటిస్తారు. అయితే.. ఈ ఎర్త్ అవర్ సందర్భంగా నగరంలోని ఐకానిక్ కట్టడాలన్ని చీకటిగా మారనున్నాయి. సచివాలయం, అంబేద్కర్‌ విగ్రహం పరిసరాలు, బుద్ధ విగ్రహం, దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జీ, చార్మినార్‌, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు అపార్ట్‌మెంట్లు, కమ్యూనిటీల్లోనూ గంటసేపు కరెంట్ వాడకుండా ఉండేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈరోజు ఎర్త్ అవర్ పాటించనున్నారు. ఢిల్లీలోనూ.. చాలా మంది ప్రజలు ఈ ఎర్త్ అవర్‌ కార్యక్రమంలో పాల్గొని.. తమ బాధ్యతను నెరవేర్చనున్నారు. గతేడాది.. ఢిల్లీలో 279 మేగా వాట్ల విద్యుత్‌ను సేవ్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.

Read Also : Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. మీడియా సంస్థ అధినేత, పోలీసు అధికారుల ఇళ్లలో సోదాలు

  Last Updated: 23 Mar 2024, 11:00 AM IST