Earth Day 2025: ప్రపంచ భూ దినోత్సవం (Earth Day 2025) ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న జరుపుకుంటారు. 2025లో కూడా ఇది ఏప్రిల్ 22న జరుగుతుంది. 1970 నుంచి ఈ వేడుక పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడానికి నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది థీమ్ ‘మన శక్తి, మన గ్రహం’. 1969లో కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలో చమురు లీకేజీ వల్ల జీవులు పెద్ద సంఖ్యలో చనిపోవడం ప్రకృతి పరిరక్షణ అవసరాన్ని హైలైట్ చేసింది. 1970లో అమెరికన్ సెనేటర్ గేలార్డ్ నెల్సన్ పిలుపుతో సుమారు రెండు కోట్ల మంది మొదటి ప్రపంచ భూ దినోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఐక్యరాష్ట్ర సమితి ఏప్రిల్ 22ను ఈ రోజుగా గుర్తించింది. అప్పటి నుంచి దీన్ని అవగాహన కోసం జరుపుతున్నారు.
భూమిపై ఎన్ని సక్రియ వైరస్‌లు?
నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం.. భూమిపై ప్రస్తుతం 10^30 (1 వెనుక 30 సున్నాలు) సక్రియ వైరస్‌లు ఉన్నాయి. అంటే 380 ట్రిలియన్ (38 లక్షల కోట్లు). యూనివర్శిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ వైరాలజిస్ట్ సారా సాయర్ ప్రకారం.. మనం వైరస్‌ల ప్రపంచంలో జీవిస్తున్నాం. వైరస్‌లు మన ప్రపంచంలో కాదు. ఈ వైరస్‌లు మొత్తం మానవ జనాభాను ప్రభావితం చేసేంత శక్తివంతమైనవి.
Also Read: Vishwambhara : ట్రోల్స్ దెబ్బకు.. పెరిగిన చిరంజీవి ‘విశ్వంభర’ VFX బడ్జెట్.. ఎన్ని కోట్లు తెలుసా?
50 ఏళ్లలో వైరస్‌ల మార్పిడి
రాబోయే 50 ఏళ్లలో వాతావరణ మార్పు, గ్లోబల్ వార్మింగ్ వల్ల వన్యప్రాణి ఆవాసాల్లో మార్పులు వస్తాయి. దీంతో క్షీరదాల మధ్య వైరస్‌ల మార్పిడి సుమారు 15,000 సందర్భాల్లో జరగవచ్చు. దీనివల్ల జంతువుల మధ్య సంపర్కం పెరుగుతుంది, వైరస్‌లు ఒక జాతి నుంచి మరొక జాతికి సంక్రమిస్తాయి. దీని ప్రభావం మానవులపై కూడా పడవచ్చు. కోవిడ్-19 మహమ్మారి ఈ ప్రక్రియను వేగవంతం చేసిందని పరిశోధకులు భావిస్తున్నారు.