Site icon HashtagU Telugu

Drugs In Soap Cases : వామ్మో.. సబ్బు పెట్టెల్లో కోట్ల డ్రగ్స్

Drugs In Soap Cases

Drugs In Soap Cases

Drugs In Soap Cases : డ్రగ్స్ స్మగ్లర్లు.. పోలీసుల కళ్ళు కప్పేందుకు రోజుకో కొత్త ఉపాయం రెడీ చేస్తున్నారు. 

దుస్తుల్లో.. బాడీ పార్ట్స్ లోపల.. డ్రగ్స్ దాచి తీసుకెళ్తూ దొరికిపోయిన వాళ్ళను మనం ఇప్పటిదాకా చూశాం.  

మిజోరాంలో ఇద్దరు మహిళా స్మగ్లర్లు ..  ఎవరికీ డౌట్ రాకుండా 22 సబ్బు పెట్టెల్లో డ్రగ్స్ దాచి తీసుకెళ్తూ దొరికిపోయారు. 

అలా అని వాళ్ళు ఏదో చిన్నాచితక స్మగ్లర్లు అనుకుంటే.. తప్పులో కాలేసినట్టే!!

Also read : Drugs Smuggling: పుష్ప సినిమాను తలపించే సీన్.. పెళ్లి వస్త్రాల చాటున డ్రగ్స్ స్మగ్లింగ్.. చివరికి ఎలా దొరికారంటే..

డౌట్ రాకుండా.. 

వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకున్న అన్నిసబ్బు పెట్టెల్లో(Drugs In Soap Cases) ఉన్న డ్రగ్స్ ను బయటకు తీసి లెక్క చేస్తే.. వాటి విలువ రూ. 1.53 కోట్లు ఉంటుందని తేలింది. దొరికిన ఆ ఇద్దరు మహిళా  స్మగ్లర్లు 28, 26 ఏళ్ల వయస్కులు. వాళ్ళ దగ్గరి నుంచి  306 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని అస్సాం రైఫిల్స్‌ అధికారులు వెల్లడించారు. ఐజ్వాల్‌లోని వెంగ్త్‌లాంగ్ ప్రాంతంలో వారి వద్ద నుంచి రూ.1.53 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశామన్నారు. నిర్దిష్ట సమాచారం మేరకు.. అస్సాం రైఫిల్స్, ఐజ్వాల్‌లోని స్పెషల్ నార్కోటిక్స్ పోలీసుల సంయుక్త బృందం సోమవారం రిపబ్లిక్ వెంగ్త్‌లాంగ్ ప్రాంతంలో ఈ డ్రగ్స్ ను సీజ్ చేసింది.