Sexual Life: మద్యం తాగి శృంగారం చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి!

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల జననేంద్రియాలకు రక్త ప్రసరణపై ప్రభావం పడుతుంది.

  • Written By:
  • Publish Date - April 21, 2023 / 04:40 PM IST

సెక్సువల్ లైఫ్ ఎంజాయ్ చేయడం కోసం కొంతమంది మద్యం తీసుకుంటుంటారు. శృంగారం ముందు మద్యం తాగుతుంటారు. అలాంటివాళ్లు తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి. కొంత మందికి మద్యం తీసుకుంటే వారిలో సెక్స్ (Sex) పట్ల కోరికలు పెరగవచ్చు. దీనర్థం వారు శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తారని కాదు. మద్యపానం వల్ల జననేంద్రియ ప్రతిస్పందన తగ్గుతుంది. శారీరకంగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఒక స్థాయి వరకు ఆల్కహాల్ (alcohol) తీసుకోవడం వల్ల లైంగిక ప్రేరేపణ ఉంటుంది. ఆ స్థాయి దాటి ఎంత ఎక్కువగా తాగితే, జననేంద్రియ ప్రతిస్పందన, శారీరక ఉద్రేకం అంత అధ్వాన్నంగా ఉంటాయి.

ఒకటీ రెండూ పెగ్గుల (alcohol) వల్ల పెద్దగా ప్రభావం ఉండదు. అయితే కొంత మత్తుతో ఉంటే శృంగారాన్ని ఎక్కువ సేపు చేయవచ్చు. క్లైమాక్స్ కు రావడానికి సమయం పడుతుంది. ఉద్రేకం పెరుగుతుంది కానీ అది భావప్రాప్తిని ఆలస్యం చేస్తుంది. ఎక్కువ సేపు శృంగారం చేయాలనుకునే వారికి ఇది బాగుంటుంది. తాగిన మగవారి (Male)లో కనిపించే లైంగిక ప్రభావాలు అంగస్తంభన కష్టమవుతుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల జననేంద్రియాలకు రక్త ప్రసరణపై ప్రభావం పడుతుంది. దీని వల్ల అంగస్తంభన కొద్దిగా కష్టంగా ఉంటుంది.

రెగ్యులర్ గా ఎక్కువగా తాగే వారిలో అంగస్తంభన లోపం తలెత్తుతుంది. అంగస్తంభనను కల్పించే యాంజియోటెన్సిన్ హార్మోన్ ను పెంచుతుంది.  ఒకటీ రెండు పెగ్గులతో పెద్దగా ప్రభావం ఏమీ ఉండదు. అయితే అతిగా తాగితే మాత్రం అది స్ఖలనంపై ప్రభావం చూపిస్తుంది. మద్యపానం స్ఖలనాన్ని ఆలస్యం చేస్తుంది. ఉద్రేకం రావడానికి, లైంగిక ప్రేరణతో స్ఖలనం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కొందరిలో స్ఖలనం జరగకపోవచ్చు. రొమాంటిక్ (Romance) గా మారుస్తుంది. మత్తు ఆడవారితో పాటు మగవారిని రొమాంటిక్ గా మారుస్తుంది. కొంత మొత్తంలో తాగడం వల్ల లైంగిక కోరిక, ఉద్రేకం పెరుగుతుంది.

Also Read: Summer Care: సమ్మర్ లో స్విమ్మింగ్ చేస్తున్నారా.. అయితే వీటితో జర జాగ్రత్త!