Wiped Out: తగ్గేదేలే అంటున్న ఉక్రెయిన్…డ్రోన్లతో యుద్ధ ట్యాంకుల్ని లేపేశారు..!!

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం రెండు నెలలు గడిచినప్పటికీ, ఏ మాత్రం తగ్గడం లేదు.

  • Written By:
  • Publish Date - May 1, 2022 / 06:30 AM IST

 

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం రెండు నెలలు గడిచినప్పటికీ, ఏ మాత్రం తగ్గడం లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ రోజుల వ్యవధిలో రాజధాని కీవ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నపటికీ, రష్యా దళాలు ఇంకా పూర్తిగా ఉక్రెయిన్ పై పట్టు సాధించలేదు. ఈ యుద్ధం సాగినంత కాలం రష్యా ఆర్థికంగానూ, సైనిక పరంగానూ భారీగా నష్టపోతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే రష్యా 23,000 కంటే ఎక్కువ మంది సైనికులను కోల్పోయిందని అంచనా వేస్తున్నారు. తాజాగా జరిగిన ఓ డ్రోన్ దాడిలో రెండు రష్యన్ ట్యాంకులు తుడిచిపెట్టుకుపోయిన ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది.

ఉక్రెనియన్ డ్రోన్ దాడిలో రెండు రష్యన్ ట్యాంకులు తుడిచిపెట్టుకుపోయాయి ఈ దాడిని 503వ నావల్ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ నిర్వహించినట్లు భావిస్తున్నారు రష్యాలోని రెండు ట్యాంకులపై దాడి ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియలేదు. కానీ వీడియో క్లిప్‌లో డ్రోన్ గాలిలో ఎగురుతూ అది రష్యా లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. కుర్గానెట్స్-25గా పిలువ బడే రెండు యుద్ధ ట్యాంకులు ఈ దాడిలో ధ్వంసం అయ్యాయి.

పుతిన్ మొండి పట్టుదల వీడకుండా యుద్ధంలో కొనసాగే కొద్దీ రష్యా సైన్యం భారీగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రష్యా సైన్యం 23,200 కంటే ఎక్కువ మంది మరణించినట్లు అవమానకరమైన దృశ్యాలు వచ్చాయి. ఈ మేరు కీవ్ కు చెందిన కొన్ని ఇండిపెండెంట్ నివేదికలు స్పష్టం చేశాయి. గణాంకాల ప్రకారం రష్యా 1,000 కంటే ఎక్కువ ట్యాంకులు, 190 యుద్ధ విమానాలను నష్టపోయింది.

ఈ వారం ప్రారంభంలో, బ్రిటన్ రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్ దాదాపు 15,000 మంది రష్యన్ సైనికులు మరణించినట్లు అంచనా వేశారు. అలాగు రష్యాకు చెందిన 2,000 కంటే ఎక్కువ సాయుధ వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని ఆయన బ్రిటన్ పార్లమెంటులో తెలిపారు. అలాగే రష్యా 60 హెలికాప్టర్లు, 20 ఫైటర్ జెట్లను కోల్పోయిందని ప్రకటించారు.

ఇదిలా ఉంటే వరుసగా తొమ్మిది వారాల దాడిలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకోవడంలో రష్యా విఫలమైందని, కానీ నగరం శిథిలావస్థకు చేరుకోగా, వేలాది మందిని మరణించారని ఉక్రెయిన్ మిలటరీ తెలిపింది. రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ తూర్పు, దక్షిణ ప్రాంతాలపై దృష్టి సారించిందని, రష్యా దళాలు శనివారం ఉక్రెయిన్ తూర్పు డోన్‌బాస్ ప్రాంతంపై దాడి కొనసాగించాయి – అయితే మూడు లక్ష్య ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంలో విఫలమయ్యాయని ఉక్రెయిన్ మిలిటరీ తెలిపింది. డొనెట్స్క్‌లోని లైమాన్, లుహాన్స్క్‌లోని సీవీరోడోనెట్స్క్ , పోపాస్నా ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి రష్యన్లు ప్రయత్నిస్తున్నారని ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తెలిపారు.