Sexual Life: సెక్స్ తర్వాత భార్యాభర్తలు ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

కలయిక తరువాత వెంటనే నీటితో శుభ్రం చేస్తే వీర్యం మొత్తం బయటికీ వెళ్లిపోతుంది.

  • Written By:
  • Updated On - April 2, 2023 / 10:04 AM IST

ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుపోయినా చాలామంది జంటలకు సంతానం కలగడం ఆలస్యం అవుతూ ఉంటుంది. కలయిక తర్వాత చేసే కొన్ని పొరపాట్ల కారణంగా పిల్లలు పుట్టరు అని కొందరు భావిస్తుంటారు. కలయిక తర్వాత స్త్రీ, పురుషులు తమ జననాంగాలను శుభ్రం చేసుకుంటారు. అలా చేసుకోవాలి కూడా. కలయిక తర్వాత శుభ్రం చేసుకోకపోతే ఇరువురికి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. పురుషులు వెంటనే శుభ్రం చేసుకుంటే పర్లేదు. కానీ పిల్లలు కావాలనుకుంటున్నవారు స్త్రీలు కలయిక జరిగిన వెంటనే శుభ్రం చేసుకోకూడదు అని కొందరు అంటూ ఉంటారు. ఎందుకంటే కలయిక తరువాత వెంటనే నీటితో శుభ్రం చేస్తే వీర్యం మొత్తం బయటికీ వెళ్లిపోతుంది. దీంతో ప్రెగ్నెన్సీ రావడం కుదరదని అనుకుంటూ ఉంటారు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే.

పురుషాంగం నుంచి వీర్యం బయటకు వస్తున్న సమయంలోనే శుక్రకణాలు చిక్కటి, ఓ చిన్న ముద్దలాగా తాయరై వేగంగా బయటకు వస్తాయి. స్ఖలన సమయంలో ఇదేమీ పల్చటి ద్రవంలా ఉండదు. కాబట్టి కడిగేసుకుంటే అంత తేలికగా పోయేది కాదు. పైగా యోని అనేది ఒక సొరంగ మార్గంలా కాకుండా ఒక గరిటెలాగా ఉంటుంది.

దీంతో ఒక్కసారిగా వీర్యం లోపలికి వెళ్లి లోపలే ఉండిపోతాయి. వీర్యంలో శుక్రకణాలతోపాటు ఉండే ద్రవమంతా కూడా ఆ శుక్రకణాలకు కావాల్సిన పోషకాహారమే. స్ఖలనం తర్వాత పురుషుడి శరీరం నుంచి బయటపడిన శుక్రకణాలు ఇక అక్కడి నుంచి స్త్రీ శరీరం నుంచి పోషకాలను గ్రహించడం మొదలు పెడతాయి. యోనిలోకి పెట్టిన పురుషాంగం తీసేయ్యగానే యోని దగ్గరకు ముడుచుకుంటుంది. శుక్రకణాలన్నీ లోపల చిక్కుకున్నట్లుగా ఉండిపోతాయి. స్త్రీ బయటి నుంచి పైపైన ఎంతగా శుభ్రంగా చేసుకున్నా లోపలికి వెళ్లిన శుక్రకణాలు పోవడం లాంటివి ఉండదు.