Site icon HashtagU Telugu

firecrackers : ఆ పటాకాయలు కాల్చొద్దు..బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌

Don't burn those firecrackers..BJP MLA Raja singh

Don't burn those firecrackers..BJP MLA Raja singh

MLA Raja singh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ దీపావళి పండుగ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం మాట్లాడుతూ.. హిందూ దేవతల బొమ్మలు ఉన్న పటాకులను వారితోనే కాల్చేలా కుట్ర జరుగుతోందని, దీన్ని అడ్డుకోవాలని సూచించారు. ఈరోజు, రేపు దీపావళి పండుగను జరుపుకుంటున్నామని.. ఈ పండుగలో పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తామని చెప్పారు. పిల్లలతో జాగ్రత్తగా టపాసులు కాల్చేలా చూడాలని సూచించారు. అయితే దీపావళి పండుగ రోజు లక్ష్మీ దేవిని పూజిస్తామని అన్నారు. కానీ పటాకులపై లక్ష్మీ దేవి బొమ్మను పెట్టి అమ్ముతున్నారని… ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కుట్ర జరుగుతోందని చెప్పారు. హిందూ దేవుళ్ల బొమ్మలు ఉన్న పటాకాయలు కాల్చవద్దని కోరారు. ఇది ఒక సంకల్పంలా తీసుకోవాలని విన్నవించారు. దీపావళి రోజున హిందువులంతా మన దేవుళ్ల బొమ్మలతో ఉండే పటాకులను బహిష్కరించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు.

అయితే దీపావళి పండుగ అంటేనే వెలుగుల పండుగ.. ఈ రోజు ఇంటిని మరింత అందంగా అలంకరించి, అతిథులను ఇంటికి పిలిచి పండుగ సంబురాలు చేసుకుంటారు. ఈ రోజు ఇల్లు దీప కాంతులతో కళకళలాడాటానికి వీలైనన్ని ఎక్కువ దీపాలు పెట్టి పండుగ చేసుకుంటారు. అలాగే చామంతి, బంతి తదితర పూలతో ఇంటిని అందంగా ముస్తాబు చేస్తారు. వీటితో పాటు బాంబులు కూడా కాలుస్తారు. దీపావళి పండుగను పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా బాణసంచా కేంద్రాలు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. పండుగకు సంబంధించిన పటాకులు, కిరాణం షాపులు, పూల దుకాణాలు, ప్రమిదలు తదితర షాపుల వద్ద జనాలు భారీగా తరలి వచ్చి పటాకులను కొనుగోలు చేస్తున్నారు.

ఇకపోతే.. దీపావళి కోసం ప్రత్యేకంగా దేవుళ్ల బొమ్మలతో కూడిన పటాకులు తయారు చేస్తుంటారు. మార్కెట్లలో చాలా రకాల బాణాసంచాలు కనిపిస్తుండగా కస్టమర్లు తమకు నచ్చిన రకాలను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. వీటితో పాటు ప్రమిదలు, పూల అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. రైతు బజారులో పూలను రాసులుగా పోసి అమ్ముతుండగా కొంత మంది రైతులు ట్రాలీ ఆటోలను ప్రధాన కూడళ్లలో ఉంచి అమ్మకాలు చేస్తున్నారు. పండగ డిమాండ్‌ను పురస్కరించుకుని పటాకులు, పూల ధరలను పెంచేసి వ్యాపారులు అమ్మకాలు చేస్తున్నారు. పటాకుల ధరలు గత ఏడాది కంటే ఈ ఏడాది 10 నుంచి 20 శాతం ధరలు పెంచి అమ్మకాలు చేస్తున్నారు. అదేవిధంగా కిలో బంతి పూలను రూ.100 నుంచి రూ.150లకు విక్రయిస్తున్నారు. ప్రమిదల డిజైన్లను బట్టి డజనుకు రూ.50 నుంచి వంద రూపాయలకు అమ్మకాలు చేస్తున్నారు. నేడు దీపావళి పర్వదినాన్ని ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.

Read Also: Diwali : జవాన్లతో కలిసి ప్రధాని మోడీ దీపావళి వేడుకలు