Donate Me A Girlfriend: నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి రా.. హల్ చల్ చేస్తున్న ఓ యువకుడు!

‘‘నాకు ఓ గర్ల్ ఫ్రెండ్ కావాలి’’ ఓ కుర్రాడు హల్ చల్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Published By: HashtagU Telugu Desk
donate me girl friend

Viral

మీరు బాయ్స్ (Boys) సినిమా చూశారా.. అందులో ఐదుగురు కుర్రాళ్లు చేసే సందడి అంతా ఇంతా కాదు. ప్రేమలు, చిలిపిచేష్టలు, అమ్మాయిల వెంట పడటం లాంటి సీన్స్ ఇప్పటికీ గుర్తుంటాయి. ఆ సినిమాలోని సీన్స్ తో పాటు పాటలు కూడా హైలైట్. ‘‘పదహారు ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్  (Girl Friend) కావాలి’’ అనే పాట ఇప్పటికీ కుర్రకారు ఫోన్ వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకనుకుంటున్నారా.. ఈ ఫొటోలో కనిపించే కుర్రాడు కూడా ‘నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి’ అంటూ హల్ చల్ చేస్తున్నాడు.

ప్రపంచంలోని దాదాపు ప్రతి వ్యక్తి భాగస్వామిని కోరుకుంటాడు. ప్రతి సంవత్సరం ఎంత మంది బ్యాచిలర్ లైఫ్ వదులుకుంటున్నారో తెలియదు. చాలా మంది తమ జీవితంలో ఇష్టమైన అమ్మాయి (Girl Friend) కోసం ఎంతగానో కష్టపడుతుంటారు. గర్ల్ ఫ్రెండ్ దొర్కపోవడంతో ఓ కుర్రాడు తన షర్ట్‌పై ‘డొనేట్ మీ ఏ గర్ల్‌ఫ్రెండ్’ రాసుకొని బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media) విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

‘నాకు గర్ల్‌ఫ్రెండ్‌ని విరాళంగా ఇవ్వండి’ (Donate Me A Girlfriend) అని రాసి ఉన్న టీ షర్ట్‌తో అబ్బాయి తిరుగుతున్నట్టుగా ఈ వీడియోలో మనం చూడవచ్చు. షాపింగ్ మాల్స్, మెట్రో, అనేక ఇతర ప్రదేశాలలో తిరుగుతూ హల్ చల్ చేస్తున్నడు. ఆ కుర్రాడు వైపు చూసినా అమ్మాయిలు మాత్రం మౌనంగా ఉంటున్నారు. కొంతమంది పాపం అంటూ ఫన్నీ గా రియాక్ట్ అవుతున్నారు. చివరకు ఈ కుర్రాడి కష్టాలను చూసి ఒక అమ్మాయి అయినా పడకపోతుందా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Roja Boxing: బాక్సింగ్ రింగ్ లో రోజా పంచులు.. వీడియో వైరల్!

  Last Updated: 19 Dec 2022, 04:06 PM IST