Site icon HashtagU Telugu

Internet Furious@Dominos: పిజ్జా పిండిపై బాత్రూమ్ బ్రష్ లు.. డొమినోస్‌ ఏం చెప్పిందంటే!?

Twitter Pic Imresizer

Twitter Pic Imresizer

“పిజ్జా” అంటే.. ఎంతోమంది ఎగబడి తింటారు. లొట్టలేస్తూ దాని రుచిని ఆస్వాదిస్తారు. అటువంటి టేస్టీ “పిజ్జా” తయారీకి వాడే పిండి నీట్ గా ఉండాలి కదా!! ఆ పిండి దగ్గర బాత్ రూమ్ క్లీన్ చేసే బ్రష్ లు వేలాడదీస్తే .. చూసే వారికి ఎలా ఉంటుంది? వాంతులయ్యేలా కడుపులో తిప్పుతుంది కదూ!! సరిగ్గా ఇటువంటి పరిస్థితిలో ఉన్న పిజ్జా బేకింగ్ యూనిట్ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
బెంగళూరులోని హోసా రోడ్‌లో ఉన్న డొమినోస్‌ అవుట్‌లెట్‌లో పిజ్జా తయారీ కోసం సిద్ధం చేసిన పిండిపై బాత్రూమ్‌ బ్రష్‌లు పెట్టారని వెల్లడైంది.

అవుట్‌లెట్‌ వెనకాల..

ఓ కస్టమర్ డొమినోస్‌ అవుట్‌లెట్‌కు వెళ్లి పిజ్జా ఆర్డర్‌ చేసి బయటకు వెళ్లాడు. అయితే పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చే సమయానికి స్టోర్ మూసేశారు. అవుట్‌లెట్‌ వెనకాల డోర్‌ వద్ద ఎదురు చూడమని చెప్పేసరికి.. అక్కడికి వెళ్లిన సదరు కస్టమర్‌కు కనిపించిన దృశ్యాన్ని స్మార్ట్‌ ఫోన్‌లో చిత్రీకరించి ట్వీట్‌ చేశాడు. దీంతో ట్వీట్‌ క్షణాల్లో వైరల్‌గా మారింది. డొమినోస్‌ నిర్వాకంపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. దీనిపై డొమినోస్‌ స్పందించింది.వైరల్‌గా మారిన ఈ ట్వీట్‌ డొమినోస్‌ నిర్వాహకుల దృష్టికి చేరింది. దీంతో ఈ సంఘటనపై ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

నెల క్రితం..

ఈ సంఘటన నెల క్రితం జరిగిందని తెలిపిన డొమినోస్‌ సదరు అవుట్‌లెట్‌పై చర్యలు తీసుకున్నట్లు వివరించారు. డొమినోస్‌ అత్యున్నత ప్రమాణాల పరిశుభ్రత, ఆహార భద్రతను నిర్ధారించడానికి ప్రపంచస్థాయి ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉంటుందని కంపెనీ పేర్కొంది.

 

Exit mobile version