మనిషి స్వార్ధ జీవి. అన్నీ తనలా ఉండాలని.. తనలా ఉంటాయని అనుకుంటాడు. ఈక్రమంలోనే తమ ఇంట్లో పెంచుకునే కుక్కల జంటకు కొందరు సంప్రదాయబద్ధంగా పెళ్లి చేశారు. ఆడ కుక్కను తెల్ల గౌను , అందమైన పూలతో అలంకరించారు. మగ కుక్కకు సూట్ వేశారు. రెండింటిని ఒక చోట నిలబెట్టి పెళ్లి తంతు కూడా జరిపించారు. ఈ మొత్తం ఘట్టాన్ని కెమెరాలో చిత్రీకరించి ఇన్ స్టాగ్రామ్ లో వీడియోను షేర్ చేశారు. పెళ్లి కూతురు పేరు లూనా అని అందులో ప్రస్తావించారు. దీనికి 4 లక్షల వ్యూస్, 46వేలకుపైగా లైక్స్ వచ్చాయి. పెళ్లి కూతురు వయ్యారాలను వర్ణిస్తూ నెటిజన్స్ ఎన్నో కామెంట్స్ పెట్టారు.
