Site icon HashtagU Telugu

Viral Video : గుర్రంపై కుక్క స్వారీ…వాహ్ అంటున్న నెటిజన్లు వైరల్ వీడియో..!!

Dog And Horse

Dog And Horse

పెంపుడు జంతువులు ఇతర జంతువులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటే… అలాంటి దృశ్యాలు మనలో ఆనందాన్ని కలిగిస్తాయి. మనం సోషల్ మీడియాలో ఇలాంటి ఎన్నో అద్భుతమైన దృశ్యాలను చూస్తుంటాం. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. గుర్రం, కుక్కకు మధ్య స్నేహం. గుర్రం మీద ఎక్కిన కుక్క…స్వారీ చేస్తూ రోడ్లమీద చక్కర్లు కొట్టింది. చూడటానికి చాలా సరదాగా ఉంది.

@Yoda4ever అనే ట్విట్టర్ ఖాతాలో వీడియో షేర్ చేశారు. 10-సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో గుర్రంపై కుక్క స్వారీ చేస్తుండటం…నెటిజన్లను ఎంతోగానో ఆకట్టుకుంది. కుక్క ఎలాంటి భయం, సంకోచం లేకుండా గుర్రం మీద నిలబడింది. గుర్రం కూడా అంతే శ్రద్ధతో కుక్కను తీసుకెళ్తుంది. కుక్క ఈ రైడ్‌ని ఆస్వాదిస్తూ కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని అక్కడున్నవారు కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడా వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

https://twitter.com/Yoda4ever/status/1548121488313778176?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1548121488313778176%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fvijaykarnataka.com%2Fviral-adda%2Ftrending%2Fvideo-of-a-dog-enjoying-riding-on-horse-is-now-going-viral-on-social-media%2Farticleshow%2F93016897.cms