Currency Note: కరెన్సీ నోట్లు తయారు చేసేది పేపర్ తో కాదట.. మరి దేనితోనో తెలుసా?

డబ్బు ప్రతి మనిషికి ఎంతో అవసరమైనది. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న ఈ సమాజంలో ఈ డబ్బు లేకపోతే ఏ పని కూడా అవ్వదు.

  • Written By:
  • Publish Date - June 16, 2022 / 03:04 PM IST

డబ్బు ప్రతి మనిషికి ఎంతో అవసరమైనది. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న ఈ సమాజంలో ఈ డబ్బు లేకపోతే ఏ పని కూడా అవ్వదు. ఎక్కడైనా కానీ మనకు ఒక 500 నోటు కానీ రెండు వేల రూపాయల నోటు కానీ జరిగింది అంటే చాలు కళ్ళకు అద్దుకొని మరి జోబులో పెట్టుకుంటాము. ఇకపోతే చాలామంది అధిక మొత్తంలో డబ్బులు చూసినప్పుడు ఈ డబ్బులు ఎలా తయారుచేస్తారు అందుకోసం దేనికి ఉపయోగిస్తారు? ఈ డబ్బులు ఎక్కడ తయారుచేస్తారు ఇలా ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే చాలామంది డబ్బులను కాగితంతో తయారు చేస్తారు అని అందరూ అనుకుంటారు.

అలా అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే కాగితంతో తయారు చేసిన నొప్పి త్వరగా తగ్గిపోతాయి. ఇకపోతే ప్రస్తుతం మనదేశంలో రూ. 10 నుంచి రూ.2000 నోట్ వరకు చలామణిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా తయారు చేస్తారు. అయితే ఈ నోట్లను తయారు చేయడంలో ప్రధానంగా 100% పత్తిని ఉపయోగిస్తారు. కేవలం మన దేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా కరెన్సీ నోట్ల తయారీకి పత్తిని వినియోగిస్తున్నారు.

75% పత్తిని 25 శాతం నార మిశ్రమాన్ని వినియోగించడం తో పాటుగా ప్రత్యేక సూత్రాన్ని ఉపయోగించి ఈ నోట్లను తయారు చేస్తారు. ఒక ప్రింటింగ్ ప్రక్రియలో పత్తిని జెలటిన్ అనే ద్రావణంతో కలపడం వల్ల నోట్లు ఎక్కువ కాలం మన్నెలా విధంగా చేస్తుంది. ఇకపోతే 1934 లోనే సెక్షన్ 22 ప్రకారం దేశంలోని నోట్లను జారీచేసే హక్కు రిజర్వు బ్యాంకు మాత్రమే ఉంది. రిజర్వు బ్యాంకు కేంద్ర ప్రభుత్వం ఇంకా ఇతర వాటాదారుల తో సంప్రదించి ఒక సంవత్సరంలో డినామినేషన్ ద్వారా అవసరమైన నోట్ల సంఖ్యను అంచనా వేస్తారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు నోట్ల రూపకల్పన కూడా మారుతూ ఉంటుంది. ఇంకా ఐరోపాలో అయితే కాంబర్ నోయిల్ కాటన్ ను నోట్ల తయారీ కోసం వినియోగిస్తారట.