Most Deleted App : 2023లో ఎక్కువమంది డిలీట్ చేసిన యాప్స్ ఇవే..

Most Deleted App : సోషల్ మీడియా యాప్స్‌కు ఇప్పుడున్న క్రేజ్ అంతాఇంతా కాదు.

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 03:51 PM IST

Most Deleted App : సోషల్ మీడియా యాప్స్‌కు ఇప్పుడున్న క్రేజ్ అంతాఇంతా కాదు. అందరి ఫోన్లలో ఇలాంటి బోలెడ్ యాప్స్ ఉంటున్నాయి. రోజూ ఫ్రీ టైం ఎక్కువగా ఉన్నవాళ్లు.. సాధ్యమైనన్ని ఎక్కువ సోషల్ మీడియా యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకొని టైం పాస్ చేస్తున్నారు. అయితే ఈ గంపెడు యాప్స్ వాడివాడి బోర్ కొట్టడంతో.. కొన్ని యాప్స్‌ను డిలీట్ కూడా చేస్తున్నారు. 2023 సంవత్సరంలో ఈవిధంగా బోర్ కొట్టి అత్యధిక సంఖ్యలో నెటిజన్లు డిలీట్ చేసిన యాప్ ఒకటి ఉంది. అదేదో అంచనా వేయండి.. ‘థ్రెడ్స్ యాప్’!!

We’re now on WhatsApp. Click to Join.

  • అమెరికా టెక్ సంస్థ TRG డేటా సెంటర్ నివేదిక ప్రకారం.. ఫేస్ ‌బుక్ కంపెనీకి చెందిన ‘థ్రెడ్స్ యాప్’  ఈ ఏడాది జులై మొదటివారంలో అందుబాటులోకి వచ్చిన ఒక్క రోజులోనే 10 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే ఆ తర్వాతి ఐదు రోజుల్లోనే అనూహ్యంగా 8 కోట్ల (80 శాతం)  మంది యూజర్లు ఆ యాప్‌ను డిలీట్ చేశారు. ఈ యాప్‌లో అద్భుతమైన ఫోటోలు, రీల్స్, వీడియోలు ఎన్నో ఉంటాయి.
  • Instagram యాప్‌ను 10 లక్షల మందికిపైగా యూజర్లు డిలీట్ చేశారు.
  • Snapchat యాప్‌ను లక్ష మందికిపైగా యూజర్లు డిలీట్ చేశారు.
  • ఇక ఎక్కువ మంది డిలీట్ చేసిన సోషల్ మీడియా యాప్స్ జాబితాలో  twitter(X), టెలిగ్రామ్, ఫేస్‌బుక్, టిక్ టాక్, యూట్యూబ్, వాట్సాప్, వీచాట్ ఉన్నాయి.
  • Facebookను 49 వేల మంది, వాట్సాప్‌ను 4,950 మంది డిలీట్(Most Deleted App) చేశారు.
  • ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 480 కోట్ల మంది సోషల్ మీడియా యూజర్లు ఉన్నారు.
  • చాలా మంది యూజర్లు సోషల్ మీడియా కోసం ప్రతిరోజూ 2 గంటల 24 నిమిషాల టైం కేటాయిస్తున్నారు.

Also Read: Sabarimala : 39 రోజుల్లో 204 కోట్లు.. శ‌బ‌రిమ‌ల ఆల‌యానికి ఆదాయం వెల్లువ