Site icon HashtagU Telugu

No Doors : ఆ ఊరిలో ఇళ్లకు తలుపులు ఉండవు.. ఎందుకో తెలుసా ?

No Doors In Satda Village Houses

No Doors : రాత్రయింది అంటే మనం తలుపుకు గడియ పెట్టనిదే నిద్రపోం. అంతగా దొంగల బెడద ఉంటుంది. ప్రత్యేకించి నగరాలు, పట్టణాల్లో ఈ సమస్య ఎక్కువ. పల్లెల్లో తలుపులు ఉన్నా.. సమ్మర్ టైంలో గాలి కోసం, తెరుచుకొని నిద్రపోయే కుటుంబాలు చాలానే ఉంటాయి. అయితే ఓ గ్రామంలో ఇళ్లకు అస్సలు తలుపులు(No Doors) ఉండవు. వాళ్లకు దొంగల భయం అనేది  ఉండనే ఉండదు. వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్ర అనే ప్రాంతం  ఉంది. అక్కడ రాజ్‌కోట్‌ పరిధిలో సత్దా అనే చిన్న ఊరు ఉంది. ఈ ఊరిలో ఏ ఇంటికి కూడా తలుపులు ఉండవు. ఎవరైనా బయటికి వెళ్లినా.. ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. కుక్కలు, పిల్లులు, దొంగలు ఇలా దేని గురించి కూడా ఈ ఊరి ప్రజలు ఎక్కువగా ఆలోచించరు. దీని వెనుక ఉన్న కారణం గురించి తెలుసుకోవాలంటే.. సత్దా గ్రామానికి 23 కి.మీ దూరంలో ఉన్న భైరవ్ దాదా దేవాలయం గురించి తెలుసుకోవాలి. ఆ ఆలయంలోని భైరవుడే తమ గ్రామానికి రక్షణ కల్పిస్తాడని స్థానికులు బలంగా విశ్వసిస్తారు. తాము ఇళ్లకు తాళం వేయాల్సిన అవసరమే లేదని గ్రామస్తులు చెబుతుంటారు. తమ తాతల కాలం నుంచే ఇళ్లకు తలుపులు లేవని అంటున్నారు. నేటికీ అదే సంప్రదాయాన్ని తాము పాటిస్తున్నామని సత్దా గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. ఎవరైనా తమ గ్రామంలో దొంగతనం చేయాలని చూస్తే గుడ్డివాళ్లు అయిపోతారని స్పష్టం చేస్తున్నారు.

Also Read : Bomb Threat Calls : అలాంటి కాల్స్‌ చేస్తే.. ఐదేళ్లు బ్యాన్

సత్దా గ్రామ ప్రజలు తమ ఊరిని మినీ శని శింగనాపూర్‌గా అభివర్ణిస్తున్నారు. మహారాష్ట్రలోని శని శింగనాపూర్‌లా తమ ఊరికి కూడా చాలా మహాత్మ్యం ఉందని చెబుతున్నారు. నాలుగేళ్ల కిందట తమ ఊరిలో దొంగతనానికి వచ్చిన నలుగురు దొంగలు నెత్తురు కక్కుకుని చనిపోయారని స్థానికులు తెలిపారు.  ఆ దొంగలకు తమ ఊరిలోనే సమాధి కట్టాల్సి వచ్చిందన్నారు. తమ చుట్టుపక్కల గ్రామాల్లో దొంగతనాలు జరుగుతాయి కానీ.. తమ గ్రామంలో ఎప్పుడూ అలాంటివి జరగవని సత్దా గ్రామస్తులు తెలిపారు.

Also Read : Mallu Ravi : చంద్రబాబుకు కోపం వస్తే..ఎన్డీయే ప్రభుత్వం కూలిపోతుంది – మల్లు రవి