Rainbow Planet : ఇంద్రధనస్సులా మెరిసిపోతున్న గ్రహం.. నాసా ఏం చెబుతోందంటే?

ఇంద్రధనస్సు.. ఈ పేరు వినగానే పెద్దవారు సైతం చిన్నపిల్లల మారి ఆ ఇంద్రధనస్సును చూస్తూ ఉంటారు. అయితే

  • Written By:
  • Publish Date - July 22, 2022 / 07:15 AM IST

ఇంద్రధనస్సు.. ఈ పేరు వినగానే పెద్దవారు సైతం చిన్నపిల్లలా మారి ఆ ఇంద్రధనస్సును చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఇంద్రధనస్సు మాత్రం ఆకాశంలో ఏర్పడిన ఇంద్రధనస్సు కాదండోయ్ చూడటానికి ఇంద్రధనస్సులా మెరిసిపోయి ఒక గ్రహం. ప్రస్తుతం చూస్తున్న ఫోటోలో అచ్చం ఇంద్రధనస్సులా మెరిసిపోతున్న ఆ గ్రహం మన సౌర కుటుంబంలో చివరన ఉన్న ఫ్లూటో గ్రహం. అయితే మొదట్లో సౌర కుటుంబంలోని 9 గ్రహాల్లో ఒకటిగా ఉన్న ఈ గ్రహాన్ని కొన్నేళ్ల కిందటే తొలగించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ప్లూటో గ్రహాన్ని మరుగుజ్జు గ్రహంగానే పిలుస్తున్నారు.

ఇది ఇలా ఉంటే దీనికి సంబంధించి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటోనీ పెట్టింది. దానితో పాటుగా ప్లూటో విశేషాలనూ పేర్కొంది. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన నాసా గతంలో ప్రయోగించిన న్యూహారిజాన్స్ వ్యోమ నౌక ప్లూటోను దగ్గరి నుంచి స్పష్టంగా చిత్రించింది. ప్లూటోపై ఉన్న వివిధ ప్రాంతాలు, లోయలు, పర్వతాలు, నున్నగా మంచుతో కూడిన మైదాన ప్రాంతాలను స్పష్టంగా ఫొటోలు తీసింది. అయితే అవన్నీ మరింత స్పష్టంగా కనిపించేలా నాసా శాస్త్రవేత్తలు న్యూహారిజాన్స్ తీసిన చిత్రాన్ని రంగుల్లోకి మార్చారు.

సౌర కుటుంబంలో అల్లంత దూరాన ఉన్న గ్రహాలు, గ్రహ శకలాలను పరిశీలించేందుకు నాసా 2006లో న్యూహారిజాన్స్ వ్యోమనౌకను ప్రయోగించింది. ఈ న్యూహారిజాన్స్ వ్యోమనౌక 2015లో ప్లూటోకు దగ్గరగా చేరింది. సుమారు ఆరు నెలల పాటు ప్లూటోకు సమీపంగా ప్రయాణించిన న్యూహారిజాన్స్ వ్యోమనౌక కు ఆ మరుగుజ్జు గ్రహానికి సంబంధించిన ఎన్నోచిత్రాలను అందిచింది. ఇంస్టాగ్రామ్ లో ఉన్న నాసా ఈ ఫోటోని షేర్ చేయడంతో అతి తక్కువ సమయంలోనే వేలలొ కామెంట్స్ లక్షల్లో లైక్స్ వచ్చాయి.