ఆడపిల్ల (women) అర్ధరాత్రి నడిరోడ్డుపై తిరిగినప్పుడే దేశానికి అసలు సిసలైన స్వాతంత్రం (Independence)వచ్చినట్లు అని గాంధీజీ (Gandhi) తెలిపారు. కానీ నేటి రోజుల్లో మాత్రం అర్ధరాత్రి కాదు కదా పట్టపగలే నడిరోడ్డుపై ఒంటరి మహిళ తిరగలేని పరిస్థితి నెలకొంది. దేశంలో రోజురోజుకు అత్యాచార ఘటనలు విపరీతం అవుతున్నాయి. ఒంటరి మహిళే కాదు అభంశుభం తెలియని చిన్నారులను కూడా వదలడం లేదు కామపిశాచులు. మహిళలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఎక్కడ కామాంధుల చేతిలో మాత్రం మార్పు రావడంలేదు.
We’re now on WhatsApp. Click to Join.
దీంతో కొన్ని దశాబ్దాల నుంచి మహిళలు కామందుల కోరల్లో చిక్కుకొని బలి అవుతూనే ఉన్నారు. ఒకవైపు దేశం మొత్తం టెక్నోలజీ వెంట పరుగులు పెడుతూ ఉంటే మరోవైపు కామాంధులు మాత్రం ఆడ పిల్లలు కనిపిస్తే చాలు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఆడపిల్లలపై అత్యాచారాలు చేయడమే కాదు దారుణంగా ప్రాణాలు సైతం తీసేస్తున్నారు. దీంతో ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే ఆడపిల్ల భయ పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రీసెంట్ గా కోల్ కత్తా లో ఓ ట్రేని డాక్టర్ ను అతి దారుణంగా హత్యాచారం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు కురిపిస్తుంది. సదరు బాధితురాలికి న్యాయం జరగాలంటూ దేశ వ్యాప్తంగా వైద్య సిబ్బంది తమ సేవలను బంద్ చేసి రోడ్ల పైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.
ఇదిలా ఉంటె దేశంలో సగటున గంటకు నాలుగు అత్యాచారాలు జరుగుతున్నట్లు తాజాగా జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) తాజా నివేదికలో వెల్లడించింది. ‘2017-22 మధ్యకాలంలో దేశంలో సగటున గంటకు నాలుగు అత్యాచారాలు జరిగాయి. వీటిలో ప్రతి మూడింటిలో నిందితుడు బాధితురాలికి తెలిసిన వ్యక్తే. అత్యధిక బాధితుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉంది. రోజుకు సగటున ఇద్దరు మహిళలపై వారి ఆఫీసుల్లో అత్యాచారాలు జరుగుతున్నాయి’ అని నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక బట్టి అర్ధం చేసుకోవచ్చు దేశంలో మహిళలకు ఎంత భద్రత ఉందొ..!!
Read Also : Raksha Bandhan 2024 : నేడు ‘రక్షాబంధన్’ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
