Site icon HashtagU Telugu

Rs 10000 Note : రూ.10,000 నోటు ఉండేది తెలుసా ?

Rs 10000 Note

Rs 10000 Note

మన దేశంలోనే అత్యధిక విలువ కలిగిన రూ.2000 కరెన్సీ నోటు అక్టోబర్ 1 నుంచి చెల్లదు.. ఇక రూ.500 నోట్లే పెద్ద నోట్లుగా మిగిలిపోతాయి. మీకు తెలుసా ? మనదేశంలో ఒకప్పుడు రూ.10,000 నోట్లు (Rs 10000 Note) కూడా ఉండేవి..  ఆ నోటును ఇప్ప్పుడు మేం మీకు చూపిస్తాం.. దాని రద్దుకు  సంబంధించిన ఆసక్తికర విశేషాలను తెలియజేస్తాం..  

1938 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఆర్బీఐ)  రూ.10,000 నోట్లు ప్రింట్ చేసింది. అయితే దీన్ని 1946 జనవరిలో రద్దు చేశారు. మళ్ళీ 1954 సంవత్సరంలోరూ.10,000 నోట్ల (Rs 10000 Note) ప్రింటింగ్ ను ప్రారంభించారు. చివరగా 1978లో ఈ నోట్లను రద్దు చేశారు. ఎక్కువ విలువ కలిగిన కరెన్సీని ఎక్కువగా  ముద్రిస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. దీని కారణంగా కరెన్సీ విలువ పడిపోతుంది. ద్రవ్యోల్బణం రేటు గణనీయంగా పెరుగుతుంది. అందుకే రూ.10,000 నోట్లను ఎక్కువ కాలం పాటు చలామణీలో ఉంచలేదు. జీడీపీ, వృద్ధిరేటు, ఆర్థిక లోటు తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వం, ఆర్బీఐ ఎంత కరెన్సీ ముద్రించాలో నిర్ణయిస్తాయి. రిజర్వ్ బ్యాంక్ 1956 నుంచి ‘కనీస రిజర్వ్ సిస్టమ్’ ఆధారంగా కరెన్సీని ప్రింట్ చేస్తోంది.

also read : 2000 Rupees Note: ఎవరైనా రూ.2000 నోటును తీసుకోవడానికి నిరాకరిస్తున్నారా..? అయితే ఆర్‌బీఐకి ఇలా ఫిర్యాదు చేయండి..!

ఆర్బీఐ రూ.2000 వరకు మాత్రమే నోట్లను ముద్రిస్తుందని.. అంతకు మించిన విలువ కలిగిన కరెన్సీని ప్రింట్ చేయదని చాలామంది భావిస్తారు. వాస్తవం ఏమిటంటే.. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఎన్నివేల రూపాయల నోట్లనైనా ఆర్బీఐ ప్రింట్ చేయొచ్చు. 1934లోని సెక్షన్ 24 ప్రకారం కేవలం రూ. 2, 5, 10, 20, 50, 100, 200, 500 నోట్లను మాత్రమే కాకుండా రూ.10,000 వరకు నోట్లను ఆర్బీఐ  ముద్రించవచ్చు. అయితే దీనిపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. దేశ పరిస్థితులను ఆర్‌బీఐ అంచనా వేసి.. ఏయే విలువ కలిగిన ఎన్నెన్ని నోట్లను ముద్రించాలో లెక్క కట్టి కేంద్ర  ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చే ముందు ..ఆర్బీఐ తో చర్చిస్తుంది. దాని ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటుంది.