High-Flying Experiment: అంతరిక్షంలో మనుషుల స్టెమ్ సెల్స్ పై ప్రయోగం లోగుట్టు!!

స్టెమ్ సెల్స్ (మూలకణాలు).. ఈ పేరులోనే మొత్తం విషయం దాగి ఉంది.తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డు తాడు (అంబిలికల్).

  • Written By:
  • Publish Date - July 21, 2022 / 06:00 AM IST

స్టెమ్ సెల్స్ (మూలకణాలు).. ఈ పేరులోనే మొత్తం విషయం దాగి ఉంది.తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డు తాడు (అంబిలికల్). పుట్టగానే శిశువు బొడ్డు భాగంలో ఉన్న ఈ తాడును కత్తిరించి పారేస్తారు.  ఇందులో విలువైన మూల కణాలు (స్టెమ్ సెల్స్) పుష్కలంగా ఉంటాయి. ఈ మూల కణాలే ఆధునిక వైద్య పరిశోధనలకు, చికిత్సలకు మూల వస్తువుగా మారాయి. ఇప్పుడు ఈ స్టెమ్ సెల్స్ పై అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనూ పరిశోధనలు జరుగుతున్నాయి.

ధృవ్ సరీన్, క్లైవ్ సెండ్సేన్ మూల కణాలతో..

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఉన్న సెడార్స్ సినాయ్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు ధృవ్ సరీన్, క్లైవ్ సెండ్సేన్ లకు చెందిన మూల కణాల శాంపిళ్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరాయి.ధృవ్ సరీన్ తెల్ల రక్త కణాల నుంచి, క్లైవ్ సెండ్సేన్ నాడీ కణాల నుంచి స్టెమ్ సెల్స్ ను సేకరించారు.నాసా ఆర్ధిక సహకారంతో ఈ రీసెర్చ్ ప్రాజెక్టు జరుగుతోంది. షూ బాక్స్ సైజులో ఉన్న పెట్టెలో ఈ ఇద్దరి మూలకణ శాంపిళ్ళను డెలివరీ జెట్ లో అంతరిక్ష కేంద్రంలోకి పంపారు. ఈ స్టెమ్ సెల్స్ ను దాదాపు నాలుగు వారాల పాటు సజీవంగా ఉంచగలిగేలా ఏర్పాట్లు చేశారు. నాలుగు వారాల తర్వాత ఆ స్టెమ్ సెల్స్ శాంపిళ్ళను స్పేస్ ఎక్స్ క్యాప్స్యుల్ ద్వారా భూమికి తిరిగి తీసుకొస్తారు.

ఎందుకీ రీసెర్చ్..

అంతరిక్ష వాతావరణం లో స్టెమ్ సెల్స్ ఎలా స్పందిస్తాయి? వాటి పెరుగుదల రేటు ఎంత ఉంటుంది ? స్టెమ్ సెల్స్ లో జన్యుపరమైన మార్పులు ఏవైనా జరుగుతాయా? అనేది తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ రీసెర్చ్ జరుగుతోంది. అంతరిక్షంలో .. అంతరిక్షానికి వెళ్లి వచ్చాక వ్యోమగాములకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు కూడా ఈ అధ్యయనం బాటలు వేయనుంది.
హార్ట్ ఎటాక్ డ్యామేజ్, పార్కిన్సన్స్,
మాక్యులర్ డీ జనరేషన్ , టైప్ 1 డయాబెటిస్ వంటి వ్యాధులకు స్టెమ్ సెల్స్ తో చికిత్సా మార్గలను అభివృద్ధి చేసేందుకు ఈ రీసెర్చ్ కల్ప తరువుగా నిలువనుంది.
ఇంతకంటే ముందు చైనా , ఇటలీ దేశాలు కూడా ఇదే విధంగా స్టెమ్ సెల్స్ ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపి స్టడీ చేశాయి.శరీరంలో వివిధ రకాల భాగాల్లో లభించే మూల కణాలతో 80 రకాల వ్యాధులకు చికిత్స అందించవచ్చని ఇప్పటి వరకూ జరిగిన వైద్య పరిశోధనల ద్వారా గుర్తించారు. అలాగే, ఎయిడ్స్, అల్జీమర్స్, డయాబెటిస్, గుండె జబ్బులు, లివర్ వ్యాధులు, మస్క్యులర్ డిస్ట్రోఫీ, పార్కిన్ సన్స్ వ్యాధి, మెదడు, వెన్నెముక గాయాలు, స్ట్రోక్, గర్భాశయ సమస్యలకు మూల కణాలతో చికిత్స చేయగా… సానుకూల ఫలితాలు వచ్చాయి. ఇంకా ఎన్నో రకాల వ్యాధులకు చికిత్స అందించేందుకు వీలుగా పరిశోధనలు జరుగుతున్నాయి.

ఎన్నో అవయవాలకు ప్రాణమిచ్చే మూల కణాలు..

ఎముక మజ్జలో, వెంట్రుక మొదళ్లలో, పిల్లల పాల పళ్లల్లో, కొవ్వులో, రక్తంలో, చర్మంలో, కండరాల్లో ఇలా ప్రతీ భాగంలోనూ మూల కణాలు ఉంటాయి. వీటన్నింటిలోకి పిండం, బొడ్డు తాడు, బొడ్డు తాడు రక్తంలో లభించే మూల కణాలు విశిష్టమైనవి. ఎన్నో అవయవాలకు ప్రాణమిచ్చే మూల కణాలు బొడ్డు తాడు, గర్భస్థ పిండంలో ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు.
పాల పళ్లల్లోంచి సేకరించినవి, ఎముక మజ్జ నుంచి సేకరించిన మూల కణాలు కూడా కొన్ని రకాల చికిత్సల్లో ఉపయోగపడతాయని నిరూపితమైంది. దెబ్బతిన్న శరీర భాగాలను మూల కణాల సాయంతో బాగు చేయవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. మూల కణాలను ఆయా శరీర భాగాల్లోకి ప్రవేశపెడితే తిరిగి అక్కడ నూతన కణాల ఆవిర్భావంతో ఆ శరీర భాగం నూతన జీవాన్ని సంతరించుకుంటుంది. దెబ్బతిన్న శరీర భాగాలను మూల కణాల సాయంతో బాగు చేయవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. మూల కణాలను ఆయా శరీర భాగాల్లోకి ప్రవేశపెడితే తిరిగి అక్కడ నూతన కణాలు ఏర్పడి వ్యాధిని నయం చేస్తాయి.ఒకసారి స్టెమ్‌ సెల్స్‌ దాచుకుంటే… షుగర్‌, బిపి నుంచి క్యాన్సర్‌ వరకూ వయసు పెరిగిన తర్వాత బాధించే రోగాల నుంచి ఎలాంటి ఖర్చు లేకుండా, తేలికగా బయటపడవచ్చు.