Site icon HashtagU Telugu

TNPCB : ఫౌండేషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు : సుప్రీంకోర్టు

Do not take any action against foundation : Supreme Court

Do not take any action against foundation : Supreme Court

TNPCB : ఇషా ఫౌండేషన్‌కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఇషా ఫౌండేషన్‌కు వ్యతిరేకంగా తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రం నిర్మాణానికి సంబంధించి ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని కోర్టు ఆదేశించింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. భవిష్యత్తు నిర్మాణాలకు చట్టబద్ధమైన అనుమతులు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.

Read Also: BJP: తెలంగాణపై బీజేపి కన్ను!

అలాగే, ఇషా ఫౌండేషన్‌కు కాలుష్య బోర్డు పంపించిన నోటీసులపై మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. ఈశా ఫౌండేషన్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని జస్టిస్ సూర్యకాంత్‌, జస్టిస్ ఎన్‌ కోటేశ్వర్‌ సింగ్‌ల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కాగా, తమిళనాడులోని వెల్లియంగిరిలో ఈశా ఫౌండేషన్ ఉన్న విషయం తెలిసిందే. అయితే 2006, 2014 మధ్య కాలంలో కోయంబత్తూరులోని వెల్లియంగిరి కొండలలో పర్యావరణ అనుమతి పొందకుండా నిర్మాణ పనులు చేపట్టారని సద్గురు ఇషా ఫౌండేషన్‌కు 2021లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

నోటీసును రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. వాటిని సవాలు చేస్తూ తమిళనాడు కాల్యుష్య నియంత్రణ మండలి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాదు, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కె. సింగ్‌లతో కూడిన ధర్మాసనం హైకోర్టు అభిప్రాయాన్ని సమర్ధించింది. TNPCB సవాలును తోసిపుచ్చింది. గత విచారణలో 2 సంవత్సరాల తర్వాత TNPCB ఈ ఉత్తర్వును ఎందుకు సవాలు చేసిందని ధర్మాసనం ప్రశ్నించింది. ఇక ఈ అప్పీలును కొట్టివేస్తూ, అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించడానికి ప్రస్తుత కేసును ఒక ఉదాహరణగా పరిగణించరాదని కూడా కోర్టు స్పష్టం చేసింది.

Read Also: Airport : వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్