Site icon HashtagU Telugu

Watch: జాబ్ పోయిందనే ఫ్రస్ట్రేషన్ లో ఆఫీసు బిల్డింగ్ కూల్చేసిన ఉద్యోగి…వైరల్ వీడియో

Muskoka Lakes Destruction Twitter

Muskoka Lakes Destruction Twitter

సీనియర్ ఉద్యోగి అని కూడా చూడకుండా…ఉద్యోగంలో నుంచి పీకేస్తే…ఒళ్లు మండకుండా ఎలా ఉంటుంది చెప్పండి. కెనాడలోని ఒంటారియో నగరంలో మస్కోసా సరస్సు ఒడ్డున ఉన్న ఓ కంపెనీలో పనిచేసే ఉద్యోగికి కూడా ఇలాగే ఒళ్లు మండింది. ఏదో కారణంతో ఉద్యోగంలో నుంచి తొలగించారన్న కోపంతో …ఓ ఎక్స్ కవేటర్ తీసుకుని కంపెనీకి వచ్చాడు. అప్పటివరకు పనిచేసిన ఆఫీస్ బిల్డింగ్ నే కూల్చేశాడు. అసలే కోపం….ఆపై కలపతో కట్టిన భవనం…తుక్కు తుక్కు అయ్యింది. కొందరు ఆ దృశ్యాన్ని వీడియో తీశారు. ఇప్పుడా ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

కంపెనీ నుంచి తొలగించారన్న కోపంతో ఓ మాజీ ఉద్యోగి ఫ్రైడ్ మెరీనా భవనాన్ని ఎక్స్ వేటర్ తో కూలగొట్టాడు. నష్టం మిలియన్ డాలర్లలో ఉంటుంది. అదృష్టం బాగుండి ఎవరూ గాయపడలేదు. ఇదేదో ఫిక్షన్ లా అనిపిస్తోందంటూ ఆ వీడియోను పోస్ట్ చేసిన స్థానికుడు పేర్కొన్నాడు. ప్రైడ్ మెరీనా గ్రూప్ కంపెనీ కెనడాలో బోటింగ్ సర్వీసులను నిర్వహిస్తుంది. సరస్సు ఒడ్డున ఈ భవనం ఉన్న ప్రాంతం చాలా ఖరీదైంది. అందుకే నష్టం కోట్లలో ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఎక్స్ వేటర్ తీసుకువస్తున్న సమయంలో ప్రైడ్ మెరీనా భవనాన్ని కూలగొడుతున్నప్పుడు పక్కన ఉన్న ఇతర భవననాలు కొంత దెబ్బతిన్నాయన్నారు. భవనాన్ని కూలగొట్టిన స్థలానికి వచ్చిన పోలీసులు 59ఏళ్ల మాజీ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు.