Direct To Mobile : డైరెక్ట్ టు మొబైల్.. ఇంటర్నెట్​ లేకుండానే లైవ్​ టీవీ, ఓటీటీ

Direct To Mobile : ఇంటర్నెట్​ లేకుండానే ఫోన్​లో ‘లైవ్​ టీవీ’.. ఇంటర్నెట్​ లేకుండానే ‘ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్’.. ఇవన్నీ సమీప భవిష్యత్తులో సాధ్యమయ్యే విషయాలే!!

  • Written By:
  • Updated On - January 16, 2024 / 08:07 PM IST

Direct To Mobile : ఇంటర్నెట్​ లేకుండానే ఫోన్​లో ‘లైవ్​ టీవీ’.. ఇంటర్నెట్​ లేకుండానే ‘ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్’.. ఇవన్నీ సమీప భవిష్యత్తులో సాధ్యమయ్యే విషయాలే!! ఔను.. నిజమే !!  ఇవన్నీ నిజం చేయగలిగే  ‘డైరెక్ట్​ టు మొబైల్ (D2M)’ బ్రాడ్​కాస్టింగ్ సాంకేతికత వచ్చే ఏడాదికల్లా సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈవిషయాన్ని భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి అభయ్ కరాండికర్ వెల్లడించారు. ఇంటర్నెట్​తో పాటు ఈ కొత్త సాంకేతికత కూడా వినియోగంలో ఉంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ వినియోగంపై ల్యాబ్​ ట్రయల్స్​ జరగుతున్నాయని తెలిపారు. తదుపరిగా నగరాల వారీగా ల్యాబ్​ ట్రయల్స్ జరుగుతాయని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘డైరెక్ట్​ టు మొబైల్ టెక్నాలజీ(Direct To Mobile) ఇంటర్నెట్​కు పోటీ కాదు. ఇది వైఫై సాంకేతికతను పోలి ఉంటుంది’’ అని వివరించారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది లో రేంజ్‌లోని స్మార్ట్ ​ఫోన్లు, 3జీ కనెక్షన్లను వినియోగిస్తున్నారు. ఎంతోమంది నేటికీ హై స్పీడ్ డేటాకు మారలేదు. ఫ్యూచర్‌లో D2M టెక్నాలజీ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే డేటాను వాడుకోవచ్చు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మొబైళ్లు ఈ సాంకేతికతకు సపోర్ట్ చేయవని అంటున్నారు. దీని కోసం మొబైళ్లలో యాంటెనా, తక్కువ శబ్దం చేసే యాంప్లిఫైయర్​లు, బేస్​బ్యాండ్​ ఫిల్టర్​లు, రిసీవర్​, ప్రత్యేక బేస్​బ్యాండ్ ప్రాసెసింగ్ యూనిట్లను కలిగి ఉండాలి.

మొబైల్‌లో వీడియోలు,సినిమాలు లేదా టీవీ ఛానెల్‌లను చూడటానికి SIM కార్డ్ లేదా ఇంటర్నెట్ రెండూ అవసరం. కానీ ఇకపై సిమ్,ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఫోన్ లో వీడియోలు చూడవచ్చు. డైరెక్ట్-టు-మొబైల్(D2M)అనే కొత్త టెక్నాలజీతో ఇది సాధ్యమవుతుంది.  దేశీయ “డైరెక్ట్-టు-మొబైల్ (D2M)” టెక్నాలజీని త్వరలో దేశంలోని 19 నగరాల్లో టెస్ట్ చేయనున్నట్లు సమాచార-ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. ఈ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కోసం 470-582 MHz స్పెక్ట్రమ్‌ను రిజర్వ్ చేయాల్సి ఉంటదని తెలిపారు. 25-30 శాతం వీడియో ట్రాఫిక్‌ను D2Mకి మార్చడం వల్ల 5G నెట్‌వర్క్‌లలో రద్దీ తగ్గుతుందని, ఇది దేశంలో డిజిటల్ పరివర్తనను వేగవంతం చేస్తుందని చంద్ర చెప్పారు. గత సంవత్సరం, బెంగళూరు, నోయిడాలో D2M టెక్నాలజీని టెస్ట్ చేసే పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయబడింది.