Dinosaur : వామ్మో.. ఈ డైనోసార్ అస్థి పంజరం ధర అక్షరాలా రూ.47.52 కోట్లు!

కొన్ని వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్ల అవశేషాలు ఇప్పటికి బయటపడుతూనే ఉన్నాయ్. అలానే ఓ అరుదైన గొర్గోసారస్ డైనోసార్

  • Written By:
  • Publish Date - July 30, 2022 / 08:00 PM IST

కొన్ని వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్ల అవశేషాలు ఇప్పటికి బయటపడుతూనే ఉన్నాయ్. అలానే ఓ అరుదైన గొర్గోసారస్ డైనోసార్ అస్థి పంజరాన్ని యుఎస్‌లో వేలం వెయ్యగా ఆ డైనోసార్ ఖరీదు 6 మిలియన్ల డాలర్లకు పలికింది. అంటే మన భారత కరెన్సీలో అది అక్షరాల రూ.47.52 కోట్లు. ఈ డైనోసార్ అస్థిపంజరాన్ని సోత్ బీ వేలం శాల వేలంలో పెట్టింది.

సుమారు 77 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ గొర్గోసారస్ డైనోసార్ సంచరించిందని నిర్దారించారు. ఇక ఇది టైరనోసారస్ రెక్స్ జాతికి దూరపు బంధువని, ఇది రెక్స్ కంటే చాలా శక్తివంతమైనదని నిర్దారించారు. ఈ డైనోసార్ కు పెద్ద తల, ఈ డైనోసార్ కు చిన్న చిన్న దంతాలు ఉన్నప్పటికీ అవి బలమైనవి అని తేల్చారు. కాగా ఈ డైనోసార్ అస్థిపంజరాన్ని కొనుగోలు చేసిన వారికి నిక్ నేమ్ పెట్టే అవకాశం కూడా ఉందట!