Site icon HashtagU Telugu

DK Pause: దినేశ్ కార్తీక్ భయపడిన వేళ…

Karthik

Karthik

సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో టీ ట్వంటీ లో దినేశ్‌ కార్తిక్‌ తన బ్యాటింగ్‌ మెరుపులతో అదరగొట్టాడు. భారత టాపార్డర్ విఫలమైన వేళ బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాకు మంచి స్కోరు అందించాడు. పాండ్య తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన డీకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అయితే మ్యాచ్‌ మిడ్‌ ఇన్నింగ్స్‌లో కార్తిక్‌ ఇంటర్య్వూ సమయంలో దేనినో చూసి బయపడినట్లు కనిపించింది. కా
టీమిండియా ఇన్నింగ్స్‌లో తన ప్రదర్శనపై అడిగిన ప్రశ్నకు కార్తిక్‌ సమాధానం ఇస్తున్నాడు. ఈ సమయంలో ఒక్కసారిగా పైకి చూసిన కార్తీక్‌ ఏదో వస్తుందన్న తరహాలో భయానక రియాక్షన్‌ ఇచ్చాడు. కాసేపటికే తేరుకొని సారీ అక్కడి నుంచి వచ్చిన బంతి నావైపు దూసుకొచ్చినట్లుగా అనిపించింది అంటూ పేర్కొ‍న్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నాలుగో టి20లో టీమిండియా సౌతాఫ్రికాపై 82 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-2తో సమంగా నిలిచింది.

Exit mobile version