Site icon HashtagU Telugu

Digvijay: కమల్‌నాథ్‌ బీజేపీలో చేరికపై స్పందించిన దిగ్విజయ్‌ సింగ్‌

Digvijay Singh Reacts On Kamal Nath Joining Bjp

Digvijay Singh Reacts On Kamal Nath Joining Bjp

 

kamal nath will never leave sonia gandhi: మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌(kamal-nath) బీజేపీ(bjp)లో చేరనున్నారని ప్రచారం జరుగుతున్నది. అయితే, వార్తలను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కమల్‌నాథ్‌ తోసిపుచ్చారు. తాను కమల్‌నాథ్‌తో మాట్లాడానని.. ఆయన ఎక్కడికీ వెళ్లడం లేదన్నారు. బీజేపీలో చేరుతారన్నది మీడియా కల్పితమని.. ఆయన ఎప్పటికీ సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ను వదిలి వెళ్లరన్నారు. అయితే, కమల్‌నాథ్‌ చింద్వారాలో పలు కార్యక్రమాలను రద్దు చేసుకొని భోపాల్‌ మీదుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీ భారీ సమావేశం జరుగుతున్నది. మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేతలంతా అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో కమల్‌నాథ్‌తో పాటు ఆయన కుమారుడు నకుల్‌ నాథ్‌(Nakul Nath)సైతం ఢిల్లీకి బయలుదేరి వెళ్లడంతో ఆయన బీజేపీలో చేరునున్నట్లు ప్రచారం జరుగుతున్నది. మధ్యప్రదేశ్‌ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిననాటి నుంచి కమల్‌నాథ్‌ ఆగ్రహంతో ఉన్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు ఎక్కువగా హాజరవడం లేదు.

We’re now on WhatsApp. Click to Join.

దిగ్విజయ్‌ సింగ్‌ జబల్‌పూర్‌లో మాట్లాడుతూ కమల్‌నాథ్‌ చింద్వారాలోనే ఉన్నారన్నారు. ఏదైనా సంచలనమైతే తప్ప అది జరగదన్నారు. కమల్‌నాథ్‌ నెహ్రూ, గాందీ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారన్నారు. ఇందిరా గాంధీని జైలుకు పంపాలని జనతా పార్టీ ప్రభుత్వం భావించిన సమయంలో ఆయన పోరాటం చేశారని.. అలాంటి వ్యక్తి సోనియాగాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్‌ను వీడుతాడని ఊహించగలరా? అంటూ దిగ్విజయ్‌ సింగ్‌ ప్రశ్నించారు.

read also : Etela Rajender : తనను బద్నాం చేయడానికే ఈ ప్రచారం – ఈటెల