UPI – 4 Hour Delay : యూపీఐ పేమెంట్ లిమిట్ రూ.2వేలు దాటితే.. ఆ రూల్ ?!

UPI - 4 Hour Delay : ఇప్పుడు మన దేశంలో యూపీఐ లావాదేవీలు విపరీతంగా పెరిగిపోయాయి.

Published By: HashtagU Telugu Desk
994953 947635 Upi Transactions India

994953 947635 Upi Transactions India

UPI – 4 Hour Delay : ఇప్పుడు మన దేశంలో యూపీఐ లావాదేవీలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈనేపథ్యంలో యూపీఐ పేమెంట్స్‌‌కు సైబర్ రక్షణను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ అమలు చేయబోతోంది. ఈమేరకు UPI పేమెంట్స్‌ కోసం కొత్త నిబంధనలను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వాటి ప్రకారం.. యూపీఐ సహా ఏదైనా డిజిటల్ ట్రాన్సాక్షన్ పద్దతిలో ట్రాన్స్‌ఫర్ చేసే అమౌంట్ రూ.2000 దాటితే దాదాపు 4 గంటల పాటు ఆ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ పూర్తి కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటారు. అయితే ఈ నిబంధన మొదటి లావాదేవీకి మాత్రమే వర్తిస్తుంది. రూ.2వేలకుపైబడిన  ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన నిధులు తప్పుడు అకౌంట్లకు మళ్లకుండా నిలువరించేందుకే ఈ రూల్ తీసుకురావాలని యోచిస్తున్నారు. రూ.2 వేలు కంటే ఎక్కువ మొత్తం చెల్లింపులకు 4 గంటల ప్రాసెస్ సమయం పెట్టడం ద్వారా సైబర్ ఫ్రాడ్స్ తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్‌తో పాటు యూపీఐ చెల్లింపులకు కూడా ఈ కొత్త రూల్‌ను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

యూకో బ్యాంక్ ఐఎంపీఎస్ (IMPS) సిస్టమ్‌లో సాంకేతిక సమస్య కారణంగా తప్పుడు అకౌంట్లలో  ఏకంగా రూ.820 కోట్లు జమయ్యాయి. ఈ చేదు అనుభవాల నేపథ్యంలో తాజా దిద్దుబాటు చర్యల దిశగా కేంద్ర సర్కారు అడుగులు వేస్తోంది. ఆర్థిక లావాదేవీల్లో  సైబర్‌ సెక్యూరిటీని మెరుగుపరచడానికి, ఆర్థిక నేరాలను నిరోధించడానికి రూ.2వేలకు పైబడిన డిజిటల్ లావాదేవీల్లో 4 గంటల జాప్యం అవసరమే అని భావిస్తున్నారు. దీని గురించి ఆర్‌బీఐ, బ్యాంకులు, గూగుల్, రేజర్‌పే వంటి టెక్ కంపెనీలతోనూ కేంద్ర ఆర్థిక సేవల విభాగం చర్చలు జరుపుతున్నట్లు(UPI – 4 Hour Delay) సమాచారం.

Also Read: Tirumala – December : డిసెంబరులో తిరుమలలో జరిగే ప్రత్యేక ఉత్సవాలివే..

  Last Updated: 29 Nov 2023, 10:33 AM IST