Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

ప్రస్తుత కాలంలో మనుషులు ఇంట్లో చేసుకొని తినే వంటల కంటే బయట ఫుడ్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా ఎక్కువ శాతం మంది బయట దొరికే ఫుడ్స్ ని తినడం కోసం ఆసక్తిని చూపిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - July 6, 2022 / 10:30 PM IST

ప్రస్తుత కాలంలో మనుషులు ఇంట్లో చేసుకొని తినే వంటల కంటే బయట ఫుడ్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా ఎక్కువ శాతం మంది బయట దొరికే ఫుడ్స్ ని తినడం కోసం ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఇదివరకు బయట ఫుడ్స్ తినడానికి ఫ్యామిలీతో అందరూ కలిసి బయటకు వెళ్లేవారు. కానీ రాను రాను ఆన్లైన్ యాప్ ల ద్వారా ఫుడ్డు డెలివరీ చేస్తుండడంతో ఇంట్లో కూర్చునే వారికి నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ చేయించుకుని క్షణాల్లో తెప్పించుకొని తింటున్నారు. అలాంటి వాటిలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కూడా ఒకటి.

ఈ జొమాటో సంస్థ ఎంత ఫేమస్ తో మనందరికీ తెలిసిందే. అయితే కస్టమర్లు ఫుడ్ విషయంలో జొమాటో పాటుగా ఇతర సంస్థలని కూడా ఎంచుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా జొమాటో ఆర్డర్లపై ఒక కస్టమర్ షాకింగ్ విషయాలను వెలుగులోకి తెచ్చాడు. అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే రాహుల్ కబ్రా అనే ఒక వ్యక్తి ఆన్ లైన్, ఆఫ్ లైన్ ఫుడ్ ఆర్డర్ బిల్లులను పోల్చుతూ ఒక పోస్టును పెట్టాడు. అందరికీ అందులో భాగంగా ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వినియోగదారుల నుంచి ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తుందని అతని పేర్కొన్నాడు.

అంతేకాకుండా ఆ రెండింటి మధ్య గల ధరల డిఫరెంట్ ను చూసి అతడు షాక్ అయ్యాడు. ఈ క్రమంలోనే చార్జీల పేరుతో డెలివరీ సంస్థలు వినియోగదారులను దోచుకుంటున్నాయని అతను ఆరోపించాడు. అతను ఆర్డర్లో వెజ్ బ్లాక్ పెప్పర్ సాస్, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ మోమోలు ఉన్నాయి. అయితే ఆఫ్ లైన్ ఆర్డర్ బిల్లు జీఎస్టీ ఎస్జిఎస్టి తో కలుపుకొని 512 రూపాయల బిల్లు అయింది. కానీ అదే ఆర్డర్ జొమాటోలు చేస్తే 689 రూపాయలు అయ్యింది. ఆ రెండింటికి పోల్చుకుంటే జొమాటో 178 రూపాయలను ఎక్కువ అమౌంట్ వసూలు చేసినట్టు అతను తెలిపాడు. ఈ సందర్భంగా అతను డెలివరీ సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా డెలివరీ బిల్లులపై ప్రభుత్వం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అని అన్నాడు. అంతేకాకుండా భవిష్యత్తులో వినియోగదారులు జొమాటో వసూలు చేస్తున్న అధిక ఖర్చులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను అని తెలిపాడు ఆ వ్యక్తి.