Green Pass : పచ్చి బఠాణీలు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చు. మనకు ఎక్కువగా లభించే వాటిల్లో పచ్చి బఠాణీలు కూడా ఒకటి. పచ్చి బఠానీలలో ప్రోటీన్, ఐరన్, పొటాషియం, విటమిన్ కే, ఫోలేట్, విటమిన్ ఏ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. పచ్చి బఠానీలను తినడం వలన జీర్ణ ప్రక్రియ మెరుగ్గా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తినడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. వీటిని ఖచ్చితంగా చిన్నా, పెద్దా తీసుకోవాలి. ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. పచ్చి బఠాణీలు మనకు మార్కెట్లో కూడా లభిస్తూ ఉంటాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి పచ్చి బఠానీలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. కనుక మీ రోజు వారి ఆహారంలో వీటిని తప్పకుండా చేర్చుకోండి. పచ్చి బఠానీలలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. కనుక రక్తహీనత సమస్య తో బాధపడేవారు రక్తాన్ని పెంచుకోవాలి అని అనుకుంటే తప్పకుండా పచ్చి బఠానీలను మీ ఆహారంతో పాటుగా తీసుకోండి.
పచ్చి బఠాణీలు తినడం వల్ల బరువు అనేది అదుపులో ఉంటుంది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల తక్కువగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. బఠాణీలతో చేసిన స్నాక్స్ తీసుకున్నా.. ఆకలి అనేది కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా ఆహారం తీసుకోలేరు. కాబట్టి బరువు అనేది అదుపులో ఉంటుంది. శాకాహారులకు ఇది బెస్ట్ ప్రోటీన్ అని చెప్పవచ్చు.
వీటి వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా హై బీపీ వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. తరచుగా పచ్చి బఠానీలను మీ ఆహారం లో తీసుకోవడం వలన క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు రాకుండా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలను తగ్గిస్తాయి. వీటిలో ఉండే విటమిన్ ఏ మరియు విటమిన్ సి కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో ముడతలు వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక పచ్చి బఠానీలను తప్పకుండా మీ ఆహారంతో పాటుగా తీసుకోండి. పచ్చి బఠాణీలు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీని వల్ల త్వరగా రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. త్వరగా నీరసం, అసలట రాకుండా ఉంటాయి.