చంద్రుడిమీద క్రాష్‌ల్యాండింగ్‌.. ఆ ఫోటోలో ఉన్న‌ది ఏంటి?

చంద్రుడిమీద ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్న యుటు 2 రోవ‌ర్ ఓ మిస్టీరియ‌స్ ప‌రిక‌రాన్ని గుర్తించింది. కొంత‌కాలంగా వాన్ కార్మ‌న్ అనే ప్రాంతంలో ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్న రోవ‌ర్‌.. తాను ఉన్న ప్ర‌దేశం నుంచి 80 మీట‌ర్ల దూరంలో క్యూబ్‌లాంటి దాన్ని ఫోటోలు తీసింది.

  • Written By:
  • Updated On - December 6, 2021 / 02:41 PM IST

చంద్రుడిమీద ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్న యుటు 2 రోవ‌ర్ ఓ మిస్టీరియ‌స్ ప‌రిక‌రాన్ని గుర్తించింది. కొంత‌కాలంగా వాన్ కార్మ‌న్ అనే ప్రాంతంలో ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్న రోవ‌ర్‌.. తాను ఉన్న ప్ర‌దేశం నుంచి 80 మీట‌ర్ల దూరంలో క్యూబ్‌లాంటి దాన్ని ఫోటోలు తీసింది. ఈ ఏడాది న‌వంబ‌ర్ నెల‌లో ఈ ఫోటో త‌మ‌కు వ‌చ్చిన‌ట్టు చైనా స్పేస్ ఏజ‌న్సీ చెబుతోంది.*మిస్ట‌రీ హ‌ట్‌*గా దాన్ని పిలుస్తున్న చైనీస్ శాస్త్ర‌వేత్త‌లు అదేంటో గుర్తించాల‌ని భావిస్తున్నారు. ఏలియ‌న్స్ క్రాష్‌లాండింగ్ సంద‌ర్భంగా ఏర్ప‌డిన ఆకార‌మా? లేక మ‌రేదైనానా అనేది తేల్చ‌బోతున్నారు. చాలాకాలంగా చైనా రోవ‌ర్ చంద్రుడి మీద ఈ ప్రాంతంలో ప‌రిశోధ‌న‌లు చేస్తోంది. ఈ మ‌ధ్య‌నే అక్క‌డ లావా లాంటి ఘ‌న ప‌దార్ధాన్నీ గుర్తించింది.

చందమామపై ఎన్నో పరిశోధనలు చేసి… అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా నిధులు లేక ఆమధ్య సైలెంట్ అయిపోవడంతో… ఆ పరిశోధనల కంటిన్యూ చేస్తోంది చైనా. ఇదివరకు మనకు కనిపించే చందమామపైకి చేంజ్ 3 ని పంపిన చైనా… ఆ తర్వాత… మనకు కనిపించనివైపు ఉండే చందమామ పైకి యూటు-2 రోవర్‌ని పంపింది. ఆ రోవర్… ఇప్పుడు చందమామను పరిశోధిస్తోంది. మరోవైపు నాసా కూడా చందమామ దగ్గరకు వ్యోమగాముల్ని పంపేందుకు భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఇలాంటి సమయంలో… యూటు-2 రోవర్ పంపిన ఫొటో ఆసక్తి రేపుతోంది.