Dharmapuri : ఆస్పత్రిలో చేరిన ధర్మపురి శ్రీనివాస్..

  • Written By:
  • Publish Date - April 10, 2024 / 12:16 PM IST

Dharmapuri Srinivas: కాంగ్రెస్(Congress) పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి. శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కొంతకాలంగా ఇంటికే పరిమితమైన డీఎస్.. వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా మూత్రనాళంలో ఇన్ ఫెక్షన్ తో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని డీఎస్ కుమారుడు, నిజామాబాద్ బీజేపీ(bjp) ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind) వెల్లడించారు. ఈమేరకు ఆసుపత్రి బెడ్ పై ఉన్న డీఎస్ తో ఉన్న ఫొటోను అరవింద్ ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, డీఎస్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసి ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డీఎస్ తొందరగా కోలుకుని ఇంటికి చేరుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ లో చేరిన డీఎస్ ను ఆ పార్టీ పెద్దల సభకు పంపించింది. అయితే, గతేడాది డీఎస్ తిరిగి సొంతగూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం వృద్ధాప్యం కారణంగా జూబ్లీహిల్స్ లోని తన నివాసానికే పరిమితమయ్యారు.

Read Also: NTR Devara : దేవర.. ఎన్టీఆర్ ప్రెస్టీజ్ గా తీసుకున్నాడా..?

మరోవైపు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనను కెసిఆర్ రాజ్యసభకు పంపారు. అయితే టీఆర్ఎస్ లో ఆయన ఇమడలేకపోయారు. సొంత పార్టీ నుంచే ఆయనకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రస్తుతం ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకుగా లేకపోవడం గమనార్హం. ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ బిజెపి ఎంపీగా ఉన్నారు.