Site icon HashtagU Telugu

Deval Verma : స్క్రాప్ మెటల్‌ను ప్రపంచ కళగా మలచిన ఇంద్రపూరి యువకుడు దేవల్ వర్మ

Deval Varma, a young man from Indrapuri, has turned scrap metal into world art

Deval Varma, a young man from Indrapuri, has turned scrap metal into world art

Deval Verma : ప్రముఖ టీవీ షో M.A.D (మ్యూజిక్, ఆర్ట్, డాన్స్) మరియు దాని హోస్ట్ హరున్ రాబర్ట్ నుండి స్ఫూర్తి పొందిన దేవల్ వర్మ వ్యర్థ పదార్థాలతో చిన్న మోడల్స్‌ను తయారు చేయడం మొదలుపెట్టాడు. అయితే ఆ చిన్న ఆసక్తి అతనికి జీవిత మార్గాన్ని పూర్తిగా మలిచే ప్రయాణానికి తోడ్పడింది.

బాల్యం నుంచి ప్రయోగాల మొదలు..

చిన్నప్పుడు దేవల్ వీకెండ్స్‌ను చిన్న చిన్న DIY ప్రాజెక్ట్స్ చేయడంలో గడిపేవాడు. ఇంటి వద్ద లేదా పాఠశాల వద్ద దొరికిన వ్యర్థ పదార్థాలు అతని కలల కొరకు ముడిపదార్థాలుగా మారాయి. అది క్రమంగా అతని టీనేజ్ వరకు కొనసాగి.. కాలేజ్‌కి వచ్చే సమయానికి అతను మెటల్ స్క్రాప్‌తో సైంటిఫిక్ ఇన్స్పిరేషన్‌తో కూడిన పరికరాలు, మోడల్స్ తయారు చేయడం ప్రారంభించాడు. సై-ఫై సినిమాలు “ట్రాన్స్‌ఫార్మర్స్” అతనికి మరింత స్ఫూర్తినిచ్చాయి.

ఇంజినీరింగ్ నుంచి కళామార్గం..

దేవల్ మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున సమయంలో అతని ప్రతిభ స్థానిక గ్యారేజీల్లో మరియు ఆటోమోటివ్ ఫ్యాక్టరీలలో పనిచేసే వారిని ఆకట్టుకుంది. వారు అతనికి మెటల్ స్క్రాప్‌ను అందించటం మొదలుపెట్టారు. అతని అత్యంత ప్రతిష్ఠాత్మక సృష్టి “హార్లే డేవిడ్సన్” అధికారిక లోగోను స్క్రాప్ మెటల్‌తో తయారు చేశారు.

ఇంజినీరింగ్ పూర్తి అయిన తర్వాత, అతను తన కలలకు నడిచేందుకు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. తల్లిదండ్రుల మొదటి అభ్యంతరాలను అధిగమించి, పూణేలోని MIT ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో ప్రొడక్ట్ డిజైన్ కోర్సులో చేరాడు. అదే అతని జీవితంలో మలుపు తీసుకొచ్చింది.

ప్రపంచాన్ని ఆకర్షించిన తొలి ప్రదర్శన..

దుబాయ్‌లో జరిగిన తన మొదటి ఎగ్జిబిషన్‌లో మెటల్ స్క్రాప్‌తో రూపొందించిన రెండు గిటార్లు ప్రదర్శించటంతో అతను ప్రొఫెషనల్ మెటల్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.

సాధనతో ప్రపంచ వేదికపై..

తన అంకితభావం, గురువుల మార్గదర్శకంతో, దేవల్ కళా ప్రపంచంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని సృష్టులు ఫంక్షనల్ పీస్‌లు (జీవవంతమైన ప్లాంటర్లు) నుండి భారీ శిల్పాల వరకు విస్తరించాయి. భారతదేశంతో పాటు సింగపూర్, ఇటలీ, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల నుండి కస్టమర్లు అతని కళాకృతులను కొనుగోలు చేస్తున్నారు.

“కళకు పునరుజ్జీవం”..

దేవల్ వర్మ తన సృష్టులతో కేవలం వ్యర్థాలను కళగా మార్చడమే కాదు, పర్యావరణ సుస్థిరతకు ఓ చిహ్నంగా నిలుస్తున్నాడు. ఇందుకు అతని ప్రయాణం నిదర్శనంగా నిలుస్తుంది. వృధా పదార్థం అంటే వృధా కాదు, అది మరో రూపంలో అందమైన కళగా మారవచ్చు అని దేవల్‌ నిరూపించారు.