Site icon HashtagU Telugu

Musi : మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇండ్ల కూల్చివేతలు ప్రారంభం..

Demolition of houses in Musi catchment areas has started.

Demolition of houses in Musi catchment areas has started.

Demolition of houses in Musi catchment areas: మూసీ పరివాహక ప్రాంతంలో 55 కిమీ పరిధిలో మొత్తం 40 వేల ఆక్రమణలను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే మంగళవారం నుంచి కూల్చివేతలను ప్రారంభించారు. ఇప్పటికే చాదర్‌ఘాట్‌ మూసీ పరివాహక ప్రాంతాల్లోని మూసానగర్‌, రసూల్‌పుర, వినాయక్‌నగర్‌ పరిసరాల్లోని ఇళ్లకు రెవెన్యూ అధికారులు ఆర్బీ-ఎక్స్‌ మార్కింగ్‌ చేసి సీల్ వేశారు. అలాగే, మలక్‌పేట్ పరిధిలోని శంకర్‌నగర్ మూసీ రివర్ బెడ్‌లో ఉన్న ఇళ్లను సైతం అధికారులు దగ్గరుండి కూల్చివేస్తున్నారు. బుల్డోజర్లు వెళ్లేందుకు దారి లేకపోవడంతో కూలీల సాయంతో కూల్చివేయిస్తున్నారు. నిర్వాసితులను ఇప్పటికే చంచల్‌గూడ డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమాదాయానికి తరలించి కూల్చివేతలు కొనసాగిస్తున్నారు.

హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో గల ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మూసీ సుందరీకరణ, ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం మూసీ రివర్‌ఫ్రంట్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్‌ పక్కా ప్లాన్‌తో ముందుకు దూసుకుపోతోంది. అధికారులు ముందుగా మూసీ నది ఎఫ్‌టీఎల్‌ పరిధిని సర్వే చేశారు. అందులో దాదాపు 16 వేల నివాసాలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు తేలింది. అందులో పేద, మధ్యతరగతి వారు నివసిస్తున్నారు. దీంతో ప్రభుత్వం.. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలకు ఉచితంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే జీఓ కూడా జారీ చేసింది. అయితే డబుల్‌ బెడ్రూమ్‌లు ఎవరికి ఇవ్వాలనే దానిపై తాజాగా రెవెన్యూ అధికారులు సర్వే చేసి.. గుర్తించి ఇళ్లపై RB-X (Riverbed Extreme) అని రాశారు.

Read Also: Mlc Kavitha : ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత