Work From Home : వర్క్ ఫ్రం హోం చేస్తే నో ప్రమోషన్.. కీలక ప్రకటన

Work From Home :  ప్రముఖ టెక్ కంపెనీ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.

  • Written By:
  • Updated On - March 18, 2024 / 03:29 PM IST

Work From Home :  ప్రముఖ టెక్ కంపెనీ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారు అలాగే జాబ్ కంటిన్యూ చేయొచ్చని.. అయితే వారికి ఇకపై ప్రమోషన్లు ఉండవని స్పష్టం చేసింది. ఈ ప్రకటన చేసింది మరేదో సంస్థ కాదు.. ప్రముఖ టెక్ కంపెనీ ‘డెల్’ !!

We’re now on WhatsApp. Click to Join

వర్క్ ఫ్రం హోం జాబ్ చేస్తున్న ఉద్యోగుల విషయమై డెల్ కంపెనీ చేసిన ప్రకటనపైనే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. కరోనా మహమ్మారి కంటే ముందు నుంచే డెల్ కంపెనీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటును కల్పించింది. దాదాపు 10 నుంచి 12 ఏళ్లుగా వర్క్ ఫ్రం హోం చేస్తున్న డెల్ ఉద్యోగులు చాలామందే ఉన్నారు. ఇటీవల కాలంలో చాలామంది ఉద్యోగులను ఆఫీసుకు ఆహ్వానించింది. అందుకు నో చెప్పిన వారికి అల్టిమేటం ఇచ్చేలా తాజా ప్రకటనను డెల్ కంపెనీ విడుదల చేసింది.

Also Read :NTR : వార్ 2లో ఎన్టీఆర్‌కి జోడిగా ఆ హీరోయిన్.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..

వర్క్ ఫ్రం హోం(Work From Home) చేస్తున్న ఉద్యోగులు కనీసం వారానికి మూడు రోజులైనా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని ఇటీవల డెల్ కంపెనీ మెమో జారీ చేసింది. వర్క్ ఫ్రం హోంకే అలవాటు పడే వారికి ప్రమోషన్లు రావని, కంపెనీలో అంతర్గతంగా రోల్స్‌ను మార్చడానికి కుదరదని తేల్చి చెప్పింది. డెల్ కంపెనీ పనితీరును మాత్రమే పరిగణిస్తుందని, ప్రతి టీమ్‌లో కనీసం 15 శాతం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక  డెల్ కంపెనీ అధినేత మైఖేల్ డెల్ సైతం వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఎక్కువ సానుకూలంగా ఉండేవారు. ఇతర కంపెనీలు కూడా రిటర్న్ టూ ఆఫీస్ విషయంలో ఉద్యోగులను ఒత్తిడి చేయడం సరికాదని ఆయన గతంలో చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారంలో డెల్ యూటర్న్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి, డెల్ ఉద్యోగులను అసంతృప్తికి గురి చేస్తోంది.

Also Read :Gujarat High Court : గూగుల్‌కు గుజరాత్‌ హైకోర్టు నోటీసులు