Losing 12 Years Life : అత్యంత కాలుష్య నగరాల జాబితా రిలీజ్ అయింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఏ సిటీ ఉందో తెలుసా ? మన దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంతో వరల్డ్ నంబర్ 1 ప్లేస్ లో ఉంది. అక్కడ కాలుష్యం ఏ రేంజ్ లో పెరిగిపోయిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అమెరికాకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ షికాగో పరిధిలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన నివేదికలో ఈవిషయాన్ని ప్రస్తావించారు. “ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (AQLI)” పేరుతో రిలీజ్ ఈ నివేదికలో గణాంకాల్లో దడ పుట్టించే మరో కీలక విషయం ఉంది. అదేమిటంటే.. ఢిల్లీలో కాలుష్య స్థాయి అలాగే కొనసాగినట్లైతే అక్కడి ప్రజల ఆయుర్దాయం దాదాపు 12 ఏళ్లు తగ్గిపోతుందట. భారత్ లోని ఇతర నగరాలతో పోలిస్తే ఢిల్లీలో జనసాంద్రత మూడు రెట్లు ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది.
Also read : Bhuvaneshwari: భువనేశ్వరి భావోద్వేగం, లోకేష్ పాదయాత్ర చేస్తుంటే కన్నీళ్లుపెట్టా!
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సగటు కాలుష్య పరిమితి (5 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్) కంటే ఎక్కువ లెవల్ లో ఢిల్లీలో కాలుష్యం ఉందని పేర్కొంది. ప్రస్తుతం భారత్ లో 67.4 శాతం మంది కాలుష్య స్థాయి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని నివేదిక వెల్లడించింది. ఫైన్ పర్టిక్యులేట్ మ్యాటర్ (PM2.5) రకం వాయు కాలుష్య తీవ్రత వల్ల భారతదేశ ప్రజల సగటు ఆయుష్షు 5.3 ఏళ్లు తగ్గిపోతోందని చెప్పింది. దేశంలోనే అత్యంత తక్కువగా కాలుష్యం ఉన్న పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలో కూడా ఫైన్ పర్టిక్యులేట్ మ్యాటర్ (PM2.5) లెవల్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే 7 రేట్లు ఎక్కువగా ఉన్నాయని (Losing 12 Years Life) వివరించింది. బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, చైనా, నైజీరియా, ఇండోనేసియా, దేశాల్లోని ప్రజలు కూడా కాలుష్యం కారణంగా దాదాపు ఒకటి నుంచి ఆరేళ్ల ఆయుష్షును కోల్పోతున్నారని పేర్కొంది.